పీసీసీ చీఫ్గా బీసీ నియామకం సామాజిక న్యాయమే

పీసీసీ చీఫ్గా బీసీ నియామకం సామాజిక న్యాయమే
  • మహేశ్ కుమార్ గౌడ్​కు బీసీ రాజ్యాధికార సమితి సన్మానం 

బషీర్ బాగ్, వెలుగు: బీసీ వర్గానికి చెందిన మహేశ్ కుమార్ గౌడ్ కు పీసీసీ చీఫ్​ పదవి దక్కడం పట్ల బీసీ రాజ్యాధికార సమితి అధ్యక్షుడు దాసు సురేశ్ సంతోషం వ్యక్తం చేశారు. సోమవారం ముఖ్య కార్యవర్గ సభ్యులతో కలిసి హైదర్ గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో గజమాలతో మహేశ్ కుమార్ గౌడ్​ను సత్కరించారు. 

సీసీ చీఫ్​గా బీసీ నాయకుడి నియామకానికి సహకరించిన కాంగ్రెస్ అధిష్టానానికి, సీఎం రేవంత్ రెడ్డి , రాష్ట్ర ఇన్ చార్జ్ దీపదాస్​కు కృతజ్ఞతలు తెలిపారు. పీసీసీ చీఫ్ గా బీసీని నియమించడం రాష్ట్రంలో కొనసాగుతున్న సామాజిక మార్పును, కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఎజెండా అయిన సామాజిక న్యాయాన్ని ప్రతిబింబిస్తున్నదని తెలిపారు. దీని ద్వారా బలహీన వర్గాలకు రాజకీయ అవకాశాలు దక్కుతాయన్నారు. 

ఎంగా ఓసీ, డిప్యూటీ సీఎంగా ఎస్సీ సామాజికవర్గ నేతలు ఉన్న ప్రస్తుత తరుణంలో పీసీసీ చీఫ్​గా బీసీని నియమించడం రాష్ట్రంలో సామాజిక సమతుల్యానికి సంకేతమన్నారు. ఈ నియామకం రాష్ట్రంలో కులగణనను  నిర్వహించడానికి మార్గం సుగమం చేస్తుందన్నారు. కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ తులసి శ్రీమాన్, ముఠా కొండస్వామి, నాగమణి, బండారు పద్మావతి , మల్లేశ్ నేత, మీడియా కన్వీనర్ మారేపల్లి లక్ష్మణ్ పాల్గొన్నారు.