హనుమకొండ, వెలుగు : రూ. 100 కోట్ల నిధులతో హనుమకొండ బస్టాండ్‌ను డెవలప్ చేయనున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ చెప్పారు. జిల్లా, ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి సోమవారం హనుమకొండ బస్టాండ్‌ను పరిశీలించారు. బస్టాండ్ నిర్మాణ పనులకు 6న కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నట్లు ప్రకటించారు.
అంతకుముందు కాళోజీ కళా క్షేత్రాన్ని పరిశీలించి, దీనిని కూడా 6న ఓపెన్ చేయనున్నట్లు ప్రకటించారు. కుడా చైర్మన్ సుందర్ రాజుయాదవ్, మాజీ చైర్మన్ మర్రి యాదవ్ రెడ్డి, కలెక్టర్ సిక్తా పట్నాయక్, కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా, ఆర్టీసీ ఆర్ఎం శ్రీలత పాల్గొన్నారు.