భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ప్రజా పాలన దరఖాస్తుల ఆన్లైన్ కోసం సిబ్బంది రెండు షిఫ్టుల్లో పనిచేసే విధంగా ఆఫీసర్లు ప్లాన్ చేసుకోవాలని కలెక్టర్ ప్రియాంక అల అన్నారు. కలెక్టరేట్లో పలు డిపార్ట్మెంట్ల ఆఫీసర్లతో సోమవారం రివ్యూ మీటింగ్నిర్వహించారు.
దరఖాస్తులను ఆన్లైన్ చేసేందుకు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు రెండు షిఫ్టుల్లో సిబ్బంది పని చేయాలన్నారు. అలాగే రిపబ్లిక్ డే వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని చెప్పారు. వేడుకలు జరిగే గ్రౌండ్లో ప్రగతి నివేదిక స్టాల్స్ తో పాటు సాంస్కృతిక కార్యక్రమాలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు.
టైం టూ టైం షెడ్యూల్ తయారు చేయాలన్నారు. పరిశుభ్రమైన తాగు నీటిని అందుబాటులో ఉంచాన్నారు. ఈ ప్రోగ్రాంలో అడిషనల్ కలెక్టర్లు పి. రాంబాబు, మధుసూదనరాజు, డీఆర్ఓ రవీంద్రనాథ్ తో పాటు అన్ని శాఖల ఆఫీసర్లు పాల్గొన్నారు.
డబుల్ బెడ్బెడ్ రూం ఇండ్లను ఇప్పించేలా చర్యలు తీసుకోండి
కలెక్టరేట్లో నిర్వహించిన గ్రీవెన్స్‌లో ప్రజల వద్ద నుంచి కలెక్టర్ దరఖాస్తులను తీసుకున్నారు. డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం గతంలో తాము దరఖాస్తు చేసుకున్నామని, అర్హులైన పేదలను గుర్తించి, ఆఫీసర్లు విచారణ నిర్వహించారని, ఇండ్లను మాత్రం ఎలాట్ చేయలేదని పాల్వంచ మండలం జయమ్మ కాలనీకి చెందిన పలువురు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. తమకు డబుల్ బెడ్రూం ఇండ్లను ఎలాట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.