నేషనల్ ఈ–కామర్స్ పాలసీ డ్రాఫ్ట్ ను ప్రభుత్వం శనివారం విడుదల చేసింది. ఈ డ్రాఫ్ట్ పాలసీ ప్రకారం ఇండియన్ కస్టమర్ల డేటాను ఆన్ లైన్ రిటైల్ దిగ్గజాలు విదేశీ సర్వర్స్ లో స్టోర్ చేసుకునే అవకాశాన్ని కల్పంచాలని ప్రతిపాదిం చింది. కానీ దీనిపై కొన్ని షరతులు విధించింది. క్రాస్ బోర్డర్ డేటా ఫ్లోపై కూడా పరిమితులు విధిస్తూ .. ఒక లీగల్, టెక్నా లజికల్ ఫ్రేమ్ వర్క్ నుఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఈ పాలసీలో పేర్కొంది. సెన్సి టివ్ డేటా సేకరణ, వాటిని నిర్వహించే తీరుపై ఈ డ్రాఫ్ట్ పాలసీలో వివరించింది. పబ్లిక్ ప్రాంతాల్లో ఇన్ స్టాల్ చేసే ఐఓటీ డివైజ్ ల నుంచి సేకరించే డేటాకు, ఈ–కామర్స్ ప్లాట్ మ్‌లు, సోషల్ మీడియా, ఇంటర్నెట్ సెర్చింజిన్ లు జనరేట్ చేసే యూజర్ల డేటాకు ఈ టెక్నా లజీ, లీగల్ ఫ్రేమ్‌వర్క్ వర్తిస్తుంది. 42 పేజీలతో కూడిన ఈ డ్రాఫ్ట్ లో ఈ–కామర్స్ ఎకోసిస్టమ్‌లో ఉన్నఆరు విషయాలను సమగ్రంగా ప్రస్తావించింది. అవి డేటా, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఈ కామర్స్ మార్కె ట్ ప్లేసెస్,రెగ్యు లేటరీ ఇష్యూలు,దేశీయ డిజిటల్ ఎకానమీ, ఈకామర్స్ ద్వారా ఎక్స్ పోర్ట్ ప్రమోషన్.ఇండియా డేటాను దేశ అభివృద్ధి కోసమే వాడాలని,దేశ పౌరులు, కంపెనీలు ఈ డేటాతో ఆర్థిక ప్రయోజనాలు పొందాలని ‘ఇండియా డేటా, ఇండియా అభివృద్ధి కోసమే’ అనే ఈ నేషనల్ ఈ–కామర్స్ డ్రాఫ్ట్ పాలసీలో పేర్కొం ది. ఈ–కామర్స్ కంపెనీ లాంటి ఏవ్యాపార సంస్థ అయినా ఇండియన్ యూజర్ల సున్నితమైన డేటాను సేకరించి, ప్రాసెస్ చేసుకోవచ్చు. దాన్ని విదేశాల్లో కూడా స్టోర్ చేసుకునే అవకాశం ఉంటుం ది. కానీ కస్టమర్ల అభిప్రాయం తెలుసుకోకుండా వారి డేటాను మరే ఇతర కంపెనీకి, థర్డ్ పార్టీ వెండార్‌కు, విదేశీ ప్రభుత్వానికి షేర్ చేయకూడదు.ఈ పాలసీలోనే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను కూడా స్పష్టం గా వెల్లడించనుంది. ఇటీవల కఠినతరం చేసిన ఈ–కామర్స్ ఎఫ్ డీఐ పాలసీ నిబంధనల ప్రకారం ఎక్స్ క్లూజివ్ డీల్స్, భారీ డిస్కౌంట్లతో ఇండియన్ కస్టమర్లను ఆకట్టుకోవడానికి వీలు లేకుండా గ్లోబల్ ఈకామర్స్ కంపెనీలపై నిషేధం విధించింది. ఈ పాలసీని రూపొందించడానికి ప్రభుత్వం కొన్ని వారాల నుంచి పనిచేస్తోందని ఉన్నత వర్గాలు వెల్లడించాయి.