విద్యార్థులకు బిగ్ అలర్ట్: 8 ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు

హైదరాబాద్: తెలంగాణలో వివిధ ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు అయ్యాయి. ఈ మేరకు 8 ప్రవేశ పరీక్షల షెడ్యూల్‎ను తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ 2025, జనవరి 15వ తేదీన విడుదల చేసింది. తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. ఇందులో ఏ పరీక్ష ఏ రోజు నిర్వహించనున్నారనే పూర్తి వివరాలు వెల్లడించారు. 

అలాగే.. ఏ పరీక్షను ఏ యూనివర్శిటీ నిర్వహిస్తోందో కూడా తెలిపారు. లా సె ట్, టీజీ ఈసెట్ పరీక్షలను ప్రతిష్టాత్మక ఉస్మానియా యూనివర్శిటీ నిర్వహించనుంది. పీజీఈసెట్, ఈఏపీసెట్ ఎగ్జామ్ ‎లను జేఎన్టీయూ కండక్ట్ చేయనుంది. అన్ని పరీక్షలు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో జరగనున్నాయని పేర్కొన్నారు. 

ALSO READ | Railway Jobs: 642 రైల్వే ఉద్యోగాలు.. జనవరి 18 నుండి దరఖాస్తులు

పరీక్షల షెడ్యూల్:

  • ఏప్రిల్ 29, 30న ఈఏపీసెట్ అగ్రికల్చర్‌, ఫార్మసీ
  • మే 2 నుంచి 5 వరకు ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్‌
  • మే 12న ఈసెట్
  • జూన్ 1న ఎడ్‌సెట్‌
  • జూన్ 6న లాసెట్, పీజీఎల్ సెట్
  • జూన్ 8,9 తేదీల్లో ఐసెట్‌
  • జూన్ 16 నుంచి 19 వరకు పీజీఈసెట్ పరీక్షలు
  • జూన్ 11 నుంచి 14 వరకు టీజీ పీఈసెట్