పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీలు ఫిక్స్.. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్

న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు అయ్యాయి. 2025, జనవరి 31వ తేదీ నుండి 2025, ఫిబ్రవరి 13వ తేదీ వరకు బడ్జెట్ సమావేశాలు నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం (జనవరి 17) ప్రకటించింది. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో జనవరి 31వ తేదీన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం ఫిబ్రవరి 1వ తేదీన 2025-2026 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‎ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టనున్నారు. 

బడ్జెట్‎పై చర్చ అనంతరం ఫిబ్రవరి 13న ఉభయ సభలు వాయిదా పడనున్నాయి. తిరిగి 2025 మార్చి 10వ తేదీ నుంచి ఏప్రిల్ 4 వరకు రెండో విడత బడ్జెట్ సమావేశాలు జరగనున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‎ను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూపొందించింది. 

ఈ ఏడాది కొన్ని రాష్ట్రా్ల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో వాటికి పెద్దపీఠ వేసే అవకాశం ఉంది. అలాగే.. బడ్జెట్‎పై కోటి ఆశలు పెట్టుకున్న వేతన జీవులు, రైతులు, కార్మికులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు సమాచారం. ఇన్ కమ్ ట్యాక్స్ పరిమితి పరిధిని కూడా కేంద్ర ప్రభుత్వం పెంచున్నున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రూ.7లక్షలుగా ఉన్న ఆదాయ పన్ను పరిమితిని రూ. రూ.9 లక్షలకు పెంచనున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.