ఝరాసంగం, వెలుగు: సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల పరిధిలోని బర్దిపూర్ దత్తగిరి ఆశ్రమంలో దత్త జయంతి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం ఆశ్రమ ఆవరణలో హోమాలు, దత్తాత్రేయుడి డోలారోహణం ఘనంగా నిర్వహించారు.ఉత్సవాల సందర్భంగా ఆశ్రమాన్ని వివిధ రంగుల విద్యుత్ దీపాలు, పూలతో అలంకరించారు. కర్నాటక, మహారాష్ట్రతో పాటు జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దత్త యజ్ఞం, చండీయాగాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
మాజీ ఎంపీ బీబీ పాటీల్ దత్తగిరి ఆశ్రమాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. ఆశ్రమానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆశ్రమ పీఠాధిపతి వైరాగ్యశిఖామణి అవధూత గిరి మహారాజ్, ఉత్తరాధిపతి సిద్దయ్య స్వామి అన్ని ఏర్పాట్లు చేశారు. జహీరాబాద్ ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులను నడిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎస్ఐ నరేశ్బందోబస్తు నిర్వహించారు.
తూప్రాన్: పట్టణంలోని సాయిబాబా సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దత్తాత్రేయ జయంతి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. మహాభిషేకం, గణపతి పూజ, కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం హాజరైన భక్తులకు ట్రస్టు సభ్యులు అన్నదానం చేశారు.