మోడీ మళ్లీ PM అయితే కేసీఆర్ సన్యాసం తీసుకుంటారా..

మోడీ మళ్లీ PM అయితే కేసీఆర్ సన్యాసం తీసుకుంటారా..

సిఎం కేసీఆర్ తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని అన్నారు మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నాయకులు దత్తాత్రేయ. రాష్ట్రానికి మోడీ ప్రభుత్వం 30వేల కోట్ల గ్రాంట్ లను ఇచ్చిందని తెలిపారు. పార్టీలకు సంబందం లేకుండా..  దేశంలోని అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందాలన్నదే బీజేపీ నినాదమని తెలిపారు. కేసీఆర్ ను ప్రధాని అభ్యర్తిగా ఎవరూ గుర్తించరని తెలిపారు. మోడీపై వ్యక్తిగత దూషణలు చేయడం కేసీఆర్ మానుకోవాలని అన్నారు.  రాష్ట్రంలో కేసీఆర్ దొర పాలన సాగిస్తున్నారని.. టీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్యేలు అంతా కేసీఆర్ కుటుంబానికి గులాంగిరి చేస్తున్నారని అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ కు నామారేపాలు కూడా లేవని చెప్పారు. మోడీ మళ్లీ ప్రధాని అయితే రాజకీయ సన్యాసం తీసుకోవడానికి కేసీఆర్ సిద్ధమాఅని దత్తాత్రేయ సవాల్ చేశారు. ఇన్ని రోజులు మోడీ పనులను సమర్ధించి ఇప్పుడు విమర్శించడం రాజకీయదురుద్ధేశం అని అన్నారు.