దత్తాత్రేయ స్వామి ఉత్సవాలు ప్రారంభం 

దత్తాత్రేయ స్వామి ఉత్సవాలు ప్రారంభం 

బోయినిపల్లి, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం వరదవెల్లి గ్రామంలో దత్తాత్రేయ స్వామి జయంతి ఉత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు అఖండ దీపారాధన, కలశ స్థాపన, స్వస్తి పుణ్యహవచనం, ఏకాదశ రుద్రాభిషేకం, హారతి కార్యక్రమాలు నిర్వహించారు. 

మల్యాల, వెలుగు: మల్యాల మండల కేంద్రంలోని శ్రీ మటమాంజనేయ స్వామి సంస్థానంలో దత్త జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురుస్వామి మిట్టపల్లి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు స్వామికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు.