
- బిహార్ సమస్తిపూర్ లో దారు
న్యూఢిల్లీ: లవర్ తో ఢిల్లీ వెళ్లిన కూతురిని ఇంటికి తీసుకొచ్చిన తండ్రి దారుణంగా హత్య చేశాడు. బిహార్ సమస్తిపూర్ లో ఈ ఘటన జరిగింది. ముకేశ్ సింగ్ కుమార్తె సాక్షి (25) మరో కులానికి చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. అతడితో కలిసి ఈ ఏడాది మార్చి 4న ఢిల్లీకి వెళ్లిపోయింది. దీంతో ఆమె కోసం తీవ్రంగా గాలించారు. ఢిల్లీలో ఉందన్న విషయం తెలుసుకొన్న ముఖేశ్ ఆమెను బుజ్జగించి సమస్తిపూర్ కు తీసుకొచ్చాడు.
అనంతరం గుట్టు చప్పుడు కాకుండా ఆమెను ఏప్రిల్ 7న చంపేశాడు. అనంతరం సాక్షి మృతదేహాన్ని ఇంట్లోని బాత్ రూమ్ లో పెట్టి తాళం వేశాడు. అయితే, కూతురు కనిపించక పోయేసరికి సాక్షి తల్లి భర్తను ప్రశ్నించింది. సాక్షి మళ్లీ ఢిల్లీకి వెళ్లిపోయింటూ భర్త చెప్పడంతో అనుమానించి పోలీసులకు సమాచారం అందించింది.
పోలీసులు ఇంటికి చేరుకుని సోదాలు నిర్వహించారు. అందులో భాగంగా బాత్ రూమ్ నుంచి దుర్వాసన రావడం వారు గమనించారు. దీంతో తాళం పగలగొట్టి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసును నమోదు చేసుకున్న పోలీసులు ముకేశ్ సింగ్ ను అరెస్టు చేశారు. సాక్షి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.