
ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్లో సౌతాఫ్రికా 50 పరుగుల తేడాతో న్యూజిలాండ్ పై ఓడిపోయింది. సౌతాఫ్రికా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ సెంచరీతో మెరిసినా ఫలితం లేకుండా పోయింది. సహచరులు విఫలమవుతున్నా న్యూజిలాండ్ పై వీరోచిత పోరాటం చేసి జట్టు విజయం కోసం పోరాడాడు. ఒకదశలో సౌతాఫ్రికా ఓటమి ఖాయమైనా ఒక్కడే వారియర్ లా చెలరేగుతూ కివీస్ ను వణికించాడు. లాహోర్ వేదికగా గడాఫీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో 67 బంతుల్లోనే సెంచరీ చేసి చిరస్మరనీయ ఇన్నింగ్స్ ఆడాడు. మిల్లర్ ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ కావడం విశేషం.
మిల్లర్ కు కనీసం మిడిల్ ఆర్డర్ ఒక్క బ్యాటర్ సహకరించినా ఫలితం వేరుగా ఉండేది. మార్కరం(31), మల్డర్(8), జాన్సెన్(3) లలో ఒక్కరైనా క్రీజ్ లో నిలబడి ఉంటే ఈ మ్యాచ్ లో సౌతాఫ్రికా విజయం సాధించేది. ఒకదశలో సౌతాఫ్రికా 218 పరుగులకే 8 వికెట్లను కోల్పోయింది. అప్పటికీ మిల్లర్ కనీసం 30 పరుగులైనా చేయలేదు. రాబడతో కలిసి 9 వికెట్ కు 38 పరుగులు జోడించిన మిల్లర్.. చివరి వికెట్ కు లుంగీ ఎంగిడి సహకారంతో అజేయంగా 56 పరుగులు జోడించి అజేయంగా నిలిచాడు. మిల్లర్ ఇన్నింగ్స్ తో సౌతాఫ్రికా ఘోర పరాజయం నుంచి తప్పించుకుంది.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ రచీన్ రవీంద్ర (101 బంతుల్లో 108:13 ఫోర్లు, ఒక సిక్సర్) వెటరన్ ప్లేయర్ కేన్ విలియంసన్ (94 బంతుల్లో 102:10 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీలు బాదడంతో నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 362 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 312 పరుగుకు ఆలౌటైంది. మిల్లర్(67 బంతుల్లో 100:10 ఫోర్లు, 4 సిక్సర్లు) అద్భుతమైన పోరాటం వృధా అయింది.
🚨 DAVID MILLER SMASHED 67 BALL HUNDRED IN CT SEMI FINAL. 🚨 pic.twitter.com/Q5bIozB0Ld
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 5, 2025