Champions Trophy 2025: ఐదు గంటలు విమానంలోనే.. సెమీ ఫైనల్ షెడ్యూల్‌పై మిల్లర్ అసంతృప్తి

Champions Trophy 2025: ఐదు గంటలు విమానంలోనే.. సెమీ ఫైనల్ షెడ్యూల్‌పై మిల్లర్ అసంతృప్తి

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ హైబ్రిడ్ మోడల్ లో జరుగుతుండడం ఇతర జట్లను సమస్యగా మారింది. ముఖ్యంగా సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లకు షెడ్యూల్ గందరగోళంగా మారింది. సెమీ ఫైనల్లో భారత ప్రత్యర్థి ఎవరనే దానిపై స్పష్టత రాకమునుపే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు దుబాయి చేరుకున్నాయి. నిజానికి ఈ రెండు జట్లలో ఒక జట్టు మాత్రమే భారత ప్రత్యర్థి. మరో జట్టు తమ సెమీ ఫైనల్ మ్యాచ్‌ను పాకిస్తాన్ గడ్డపైనే ఆడాల్సి ఉంది. అటువంటిది ఇరు జట్లను ఐసీసీ అధికారులు మొదట.. దుబాయ్ పంపించారు. 

ఇంగ్లాండ్‌తో జరిగే చివరి గ్రూప్ మ్యాచ్ ముగిశాక ప్రోటీస్ జట్టు దుబాయ్‌ ప్రయాణించింది. ఆదివారం (మార్చి 2) జరిగిన గ్రూప్ మ్యాచ్ లో న్యూజిలాండ్ ను భారత్ ఓడించడంతో టీమిండియా సెమీ ఫైనల్ ప్రత్యర్థి ఎవరనే విషయం తేలిపోయింది. ఆస్ట్రేలియా సెమీ ఫైనల్  భారత్ తో ఆడనుంది అని ఖాయం కావడంతో సౌతాఫ్రికా వెంటనే పాకిస్థాన్ కు చేరుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే షెడ్యూల్ ప్రకారం  రెండో సెమీ ఫైనల్ పాకిస్థాన్ లోనే జరగాల్సి ఉంది. దీంతో 24 గంటల వ్యవధిలో సౌతాఫ్రికా దుబాయ్, పాకిస్థాన్ దేశాలు ప్రయాణించింది. ఈ గందరగోళ షెడ్యూల్ పై సెమీ ఫైనల్ ఓటమి తర్వాత మిల్లర్ అసంతృప్హి వ్యక్తం చేశాడు. 

ఐసీసీ తమకు విధించిన షెడ్యూల్ తమ జట్టు ఓటమికి కారణమని చెప్పకనే చెప్పాడు. సెమీ ఫైనల్ తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ తో మాట్లాడిన మిల్లర్ ఇలా అన్నాడు " ఐసీసీ షెడ్యూల్ మాకు సంతృప్తికరంగా లేదు. ఇంగ్లాండ్ తో మ్యాచ్ తర్వాత మేము విమానంలో దుబాయ్ కు ప్రయాణించాల్సి వచ్చింది. సాయంత్రం 4 గంటలకు దుబాయ్ చేరుకున్నాము. ఆ తర్వాత ఉదయం 7.30 గంటలకు మేము బయలుదేరి పాకిస్థాన్ కు తిరిగిరావాల్సి వచ్చింది. ఐదు గంటలు విమానంలో ప్రయాణించడం వలన మేము కోలుకోవడానికి తగినంత సమయం మా దగ్గర లేదు".అని మిల్లర్ తెలిపాడు.

ALSO READ | Team India: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్.. ఆ ఇద్దరు భారత క్రికెటర్లకు ఇదే చివరి ఐసీసీ ట్రోఫీ!

ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ ఫైనల్లో సౌతాఫ్రికా 50 పరుగుల తేడాతో న్యూజిలాండ్ పై ఓడిపోయింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ సెంచరీతో మెరిసినా ఫలితం లేకుండా పోయింది. ఒకదశలో సౌతాఫ్రికా ఓటమి ఖాయమైనా ఒక్కడే వారియర్ లా చెలరేగుతూ కివీస్ ను వణికించాడు. లాహోర్ వేదికగా గడాఫీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో 67 బంతుల్లోనే సెంచరీ చేసి చిరస్మరనీయ ఇన్నింగ్స్ ఆడాడు. మిల్లర్ ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ కావడం విశేషం.    

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ESPNcricinfo (@espncricinfo)