David Miller: ప్రేయసిని పెళ్లాడిన డేవిడ్ మిల్లర్.. ఫోటోలు వైరల్

సౌతాఫ్రికా స్టార్ క్రికెటర్ డేవిడ్ మిల్లర్ వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. తన చిరకాల ప్రేయసి కెమిల్లా హారిస్‌ని నిన్న (మార్చి 10) పెళ్లి చేసుకున్నాడు. దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో ఈ వివాహ వేడుక గ్రాండ్ గా జరిగింది. ఈ సంతోషకరమైన సందర్భాన్ని కెమిల్లా తన ఇంస్టాగ్రామ్ వేదికగా తెలియజేసింది. 2023 ఆగస్టు 31 న వీరిద్దరూ నిశ్చితార్ధం చేసుకున్నారు.ప్రస్తుతం వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

దశాబ్ధకాలంగా మిల్లర్ దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టులో ఆడుతున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడుతూ సఫారీ జట్టులో కీలక ప్లేయర్ గా మారాడు. ఇటీవలే దక్షిణాఫ్రికా ప్రీమియర్ లీగ్ లో పార్ల్ రాయల్స్ తరపున ఆడాడు. ప్రస్తుతం ఈ సఫారీ స్టార్ ఐపీఎల్ కు సిద్ధమవుతున్నాడు.

ALSO READ :- హైదరాబాద్ లో పలు చోట్ల ఎస్ఓటీ దాడులు.. గంజాయి పట్టివేత

 గుజరాత్ టైటాన్స్ జట్టు తరపున ఆడనున్నాడు. 2022, 2023 సీజన్ లలో గుజరాత్ జట్టు విజయాలలో కీలక పాత్ర పోషించిన మిల్లర్ ఈ సారి మరింతగా చెలరేగాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.