ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కు నటన అంటే చాలా ఇష్టమైన అందరికీ తెలుసు. ఇప్పటికే ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ టిక్‌టాక్ వీడియోల రూపంలో తన నటన ప్రావీణ్యాన్ని పలుమార్లు చూపించారు. సినీ హీరోలు అల్లు అర్జున్, ప్రభాస్, మహేశ్‌బాబుతో పాటు పలువురు టాలీవుడ్ హీరోల పాటలకు స్టైప్పు లేస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఇదంతా గతం..! ఇప్పుడు వార్నర్.. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్‌లో నటించారు.
CRED యాప్ ఫన్నీ యాడ్
క్రెడిట్ కార్డుల పేమెంట్స్ యాప్ క్రెడ్ (CRED) ఓ ఫన్నీ యాడ్ రూపొందించింది. ఇందులో రాజమౌళి దర్శకుడిగా, వార్నర్ హీరోగా నటించారు. "ఐపీఎల్ మ్యాచ్ టికెట్లపై డిస్కౌంట్ కావాలంటే ఏం చేయాలి.." అని రాజమౌళి వార్నర్‌కి ఫోన్ చేసి అడుగుతారు. అందుకు వార్నర్ బదులిస్తూ.. "రాజా సర్.. మీ దగ్గర క్రెడ్ యూపీఐ ఉంటే మీకు క్యాష్ బ్యాక్ లభిస్తుంది.." అని సమాధానమిస్తాడు. మరి నార్మల్ యూపీఐ అయితే అని రాజమౌళి అడగ్గా.. అలా డిస్కౌంట్ కావాలంటే మీరు నాకోసం ఓ ఫేవర్ చేయాలని వార్నర్ కోరతాడు. తనను పెట్టి ఓ సినిమా చేయమని అడుగుతాడు.
వార్నర్ డిమాండ్‌కు అంగీకరించిన జక్కన్న.. ఒకవేళ తన సినిమాల్లో నిజంగానే వార్నర్ నటిస్తే ఎలా ఉండేదో ఊహించుకున్నారు. సెట్స్‌లో వార్నర్ చేసే అల్లరి, వేసే స్టెప్పలు, డైగాల్స్ ..ఇవన్నీ ఊహించుకొని జక్కన్న భయపడిపోయారు. ఒకానొక సమయంలో ఇద్దరూ కూర్చొని చర్చిస్తున్నప్పుడు.. "ఆస్కార్ వేదికగా కలుద్దాం.." అని వార్నర్ ఒక డైలాగ్ పేలుస్తాడు. మొత్తంగా ఈ వీడియో చూస్తే కడుపుబ్బా నవ్వుకుంటారనే చెప్పాలి. క్రెడ్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఈ వీడియోని మీరూ చూసేయండి.
Favours are subject to market risk.
— CRED (@CRED_club) April 12, 2024
pic.twitter.com/QSPToEGYzg