ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ న్యూ ఇయర్ రోజున తన అభిమానులకు షాకింగ్ న్యూస్ చెప్పాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 37ఏళ్ల వార్నర్ .. భారత్ పై వన్డే ఫైనల్ మ్యాచ్ తనకు చివరిదని ప్రకటించాడు. ఇప్పటికే టెస్టులకు గుడ్ బై చెప్పిన వార్నర్ టీ 20 క్రికెట్ లో కొనసాగుతానని ప్రకటించాడు. ఈ ఏడాది జూన్ లో జరగనున్న టీ20 ప్రపంచకప్ లో ఆడేందుకు అందుబాటులో ఉంటానని చెప్పాడు. అవసరమైతే 2025 జరిగే ఛాంపియన్స్ ట్రోఫికి కూడా అందుబాటులో ఉంటానని తెలిపాడు.
వార్నర్ తన 15 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ లో 111 టెస్టులు ఆడిన వార్నర్ 8695 పరుగులు చేశాడు. ఇందులో 26 సెంచరీలు,36 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. టెస్టుల్లో వార్నర్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 335 నాటౌట్. 161 వన్డేలు ఆడిన వార్నర్ 6932 పరుగులు చేశాడు. ఇందులో 22 వన్డేలు, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వ్యక్తిగత స్కోరు 179.