ఆస్ట్రేలియన్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ శుక్రవారం(జనవరి 12) హాలీవుడ్ స్టైల్ ఎంట్రీ ఇచ్చాడు. ఇటీవలే టెస్టు, వన్డేల నుంచి రిటైరైన వార్నర్.. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో హెలికాప్టర్‌లో గ్రౌండ్ లోకి అడుగుపెట్టాడు. బిగ్ బాష్ లీగ్ లో సిడ్నీ థండర్ తరపున ఓపెనర్ గా ఆడుతున్న వార్నర్.. సిడ్నీ సిక్సర్ తో మ్యాచ్ కు సిద్ధమయ్యాడు . క్రికెట్ కు గుడ్ బై చెప్పిన ఈ స్టార్ ఓపెనర్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు.
37 ఏళ్ల వార్నర్.. SCG నుండి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన సోదరుడి వివాహానికి హాజరైన ఆ వెంటనే హంటర్ నుండి ప్రయాణించాడు. సిడ్నీ సిక్సర్స్‌తో కొన్ని గంటల్లో మ్యాచ్ కు ముందు వేదిక వద్దకు చేరుకున్నాడు. మ్యాచ్ చూసే ఆడియెన్స్ కోసం గేట్లు తెరవడానికి ముందే డేవిడ్ భాయ్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఎస్సీజీలో ల్యాండ్ అయింది. దీంతో అతడు ప్రాతినిధ్యం వహిస్తున్న సిడ్నీ థండర్ టీమ్ ‘అతను వచ్చేశాడు’ అంటూ నెట్టింట ఓ పోస్ట్ చేసి తమ సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది.
వార్నర్ హెలికాప్టర్ లో ల్యాండింగ్ అయిన వీడియో చూసిన నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. వార్నర్ కు ఆటపై ఉన్న అంకితభావం అని ఒకరు కామెంట్ చేస్తుంటే..వార్నర్ హాలీవుడ్ స్టైల్ ఎంట్రీ అదిరిపోయిందని మరికొందరు అంటున్నారు. బిగా బాష్ లీగ్ తర్వాత వార్నర్ టీ20 లీగ్ లతో బిజీ కానున్నాడు. ఐఎల్ టీ20 లీగ్‌లో దుబాయ్ క్యాపిటల్స్ తరఫున ఆ తర్వాత వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగే టీ20 సిరీస్‌లో ఆడనున్నాడు. మార్చ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఐపీఎల్ ఆడనున్నాడు.
Ever seen anything like it? ? ? @davidwarner31 arrives to the @scg on a helicopter to the Sydney Smash. #BBL13 pic.twitter.com/gS4Rxmz71C
— KFC Big Bash League (@BBL) January 12, 2024