ఐపీఎల్ 2023 సీజన్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ కొత్త కెప్టెన్ను ప్రకటించింది. రెగ్యులర్ కెప్టెన్ రిషబ్ పంత్..రోడ్డు ప్రమాదంలో గాయపడి ఐపీఎల్కు దూరం కావడంతో...అతని స్థానంలో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ డేవిడ్ వార్నర్కు సారథ్య బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్మెంట్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.
2022 డిసెంబర్ 30న ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఫ్యామిలీతో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకునేందుకు ఢిల్లీ నుంచి బయల్దేరిన పంత్ కారు డివైడర్‌ను ఢీకొని బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో పంత్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్తో పాటు..పలు సిరీస్లకు పంత్ దూరమయ్యాడు. పంత్ ఇంకా గాయాల నుంచి కోలుకోకపోవడంతో ఐపీఎల్ 2023లోనూ ఆడటం లేదు. ఈ క్రమంలో పంత్ స్థానంలో వార్నర్ను ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా నియమించుకుంది.
అటు 2015లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా డేవిడ్ వార్నర్ నియమించబడ్డాడు. ఆ తర్వాత హైదరాబాద్ ఐపీఎల్ ట్రోఫీని దక్కించుకుంది. అంతేకాదు తన సారథ్యంలో సన్ రైజర్స్ను వార్నర్.. ఐదు సార్లు ప్లేఆఫ్స్ వరకు తీసుకెళ్లాడు. ఫాంలేమితో పాటు..జట్టు వైఫల్యాలతో ఐపీఎల్ 2021 సీజన్‌లో వార్నర్ తన కెప్టెన్సీని కోల్పోయాడు. ఆ తర్వాత జట్టులో స్థానాన్ని కోల్పోయాడు. లాస్ట్ ఇయర్ జరిగిన ఐపీఎల్ వేలంలో వార్నర్ను ఢిల్లీ దక్కించుకుంది.