టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ మైదానంలోకి దిగితే పరుగుల వరద పారిస్తాడు. ఫార్మాట్ ఏదైనా ప్రత్యర్థులకు అతని వికెట్ తీయడం సవాల్ తో కూడుకున్నది. 2008 ఆగస్టులో తన కెరీర్ లో తొలి అంతర్జాతీయ క్రికెట్ మొదలుపెట్టిన విరాట్.. ఇప్పటికీ తన పరుగుల దాహాన్ని తీర్చుకునే పనిలో ఉన్నాడు. 15 ఏళ్లుగా ఎన్నో రికార్డులను నెలకొల్పిన కోహ్లీ.. 2027 వరల్డ్ కప్ ఆడితే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ప్రస్తుతం కోహ్లీ వయస్సు 35 సంవత్సరాలు. ఈ నేపథ్యంలో కింగ్ 2027 వరల్డ్ కప్ ఆడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. విరాట్ ఆట చూసుకుంటే టాప్ ఫామ్ లో ఉన్నాడు. ఇటీవలే జరిగిన వన్డే వరల్డ్ కప్ లో 765 పరుగులు చేసి టోర్నీ టాప్ స్కోరర్ గా నిలిచి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. ఫిట్ నెస్ పరంగా కోహ్లీకి తిరుగులేదు. దీంతో 2027 వన్డే వరల్డ్ కప్ ఆడటం ఖాయంగా కనిపిస్తుంది. ఇదిలా ఉండగా ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ కోహ్లీ 2031 వన్డే వరల్డ్ కప్ ఆడతాడని జోస్యం చెప్పాడు.
కోహ్లీ అత్యుత్తమ ఫామ్ లో ఉన్నాడని.. ఫిట్ నెస్ లో అతనిని మించిన వారు లేరని..అట మీద అతనికి ఉన్న అంకిత భావం అతన్ని 2031 వరల్డ్ కప్ ఆడేలా చేస్తుందని వార్నర్ చాలా ధీమాగా చెప్పాడు. ఇదే సమయంలో ఒక అభిమాని వార్నర్ సర్.. మీరు 2027 వన్డే వరల్డ్ కప్ ఆడితే చూడాలని ఉందని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు తెలిపాడు. దీనికి వార్నర్ నవ్వుతూ ఉన్న సింబల్ పెట్టాడు. దీంతో వార్నర్ 2027 వరల్డ్ కప్ ఆడే అవకాశాలు దాదాపుగా లేనట్టుగానే కనిపిస్తున్నాయి. మొత్తానికి కోహ్లీపై వార్నర్ జోస్యం నిజమవుతుందో లేదో చూడాలి.
No reason why he can’t, he is very fit and loves the game so much. https://t.co/5iQry4pp4Y
— David Warner (@davidwarner31) November 30, 2023