టీమిండియా సీనియర్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గ్రేట్ స్పిన్నర్ అని చాలా మందికి తెలుసు. అయితే అశ్విన్ బౌలింగ్ వేస్తున్నప్పుడు ఎంత షార్ప్ గా ఉంటాడో చాలా కొద్ది మందికే తెలుసు. మన్కడింగ్ చేయడం, బ్యాటర్ల కదలికలు పరిశీలించి వారిని బోల్తా కొట్టించడం అశ్విన్ కి మాత్రమే తెలుసు. అందుకే ఎంత స్టార్ బ్యాటర్ అయినా అశ్విన్ బౌలింగ్ ఆచితూచి ఆడతారు. అయితే ఆస్టేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అశ్విన్ తో మైండ్ గేమ్ ఆడి పరువు పోగొట్టుకున్నాడు.
Also Read : ఛాంపియన్ జట్టుని పసికూనగా మార్చిన టీమిండియా.. ఆసీస్‌పై సరికొత్త రికార్డులు
భారత్ ఆస్ట్రేలియా సిరీస్ లో భాగంగా నిన్న ఇండోర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచులో అశ్విన్ బౌలింగ్ చేస్తున్నప్పుడు వార్నర్ అదేపనిగా రైట్ హ్యాండ్ వైపు తిరిగి ఆడాడు. ఈ క్రమంలో స్వీప్ చేస్తూ ఒక ఫోర్ కొట్టిన వార్నర్.. అశ్విన్ ని తక్కువగా అంచనా వేసాడు. అయితే 15 ఓవర్లో మళ్ళీ బౌలింగ్ వేయడానికి అశ్విన్ రాగా.. వార్నర్ మరింత అత్యుత్సాహం చూపించి ఔటయ్యాడు. రైట్ హ్యాండ్ ఆడుతున్న వార్నర్ లెఫ్ట్ హ్యాండ్ తిరిగి స్వీప్ ఆడే క్రమంలో యల్బీడబ్ల్యూ గా వెనుదిరిగాడు. మొత్తానికి అశ్విన్ ని కన్ఫ్యూజన్ చేసే ప్రయత్నంలో వార్నర్ తగిన మూల్యం చెల్లించుకున్నాడు.
ఇక ఈ మ్యాచులో వార్నర్ 39 బంతుల్లోనే 53 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. మొహాలీలో జరిగిన తొలి వన్డేలో కూడా వార్నరే టాప్ స్కోరర్ కావడం విశేషం. ఈ సిరీస్ లో వార్నర్ మినహా మిగిలిన ఆసీస్ బ్యాటర్లందరూ విఫలమయ్యారు.
Two wickets in an over for @ashwinravi99 ??
— BCCI (@BCCI) September 24, 2023
David Warner and Josh Inglis are given out LBW!
Live - https://t.co/OeTiga5wzy… #INDvAUS @IDFCFIRSTBank pic.twitter.com/z62CFHTgq1