Champions Trophy 2025: ఆ ఒక్క ట్రోఫీ ఆడాలని ఉంది.. రిటైర్మెంట్ తర్వాత వార్నర్ ట్విస్ట్

Champions Trophy 2025: ఆ ఒక్క ట్రోఫీ ఆడాలని ఉంది.. రిటైర్మెంట్ తర్వాత వార్నర్ ట్విస్ట్

వెస్టిండీస్, అమెరికా వేదికలుగా ఇటీవలే జరిగిన టీ20 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా సెమీస్ కు చేరడంలో విఫలమైంది. దీంతో ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్మర్ అంతర్జాతీయ క్రికెట్ లో అన్ని ఫార్మాట్లకు అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే తాజాగా ఈ ఆసీస్ ఓపెనర్ కొత్త ట్విస్ట్ ఇచ్చాడు. పాకిస్థాన్ వేదికగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి తాను అందుబాటులో ఉంటానని వెల్లడించాడు.  ఇంస్టాగ్రామ్ వేదికగా కొంతకాలం ఫ్రాంచైజీ క్రికెట్ ఆడాలనుకుంటున్నానని.. ఆస్ట్రేలియా జట్టు తరపున 2025లో జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు సిద్ధంగా ఉన్నానని తన మనసులో మాట బయట పెట్టాడు. 

ALSO READ | IND vs ZIM 2024: జింబాబ్వేతో మూడో టీ20.. అందరి కళ్లు శాంసన్ పైనే

భారత్ వేదికగా ముగిసిన వన్డే వరల్డ్ కప్ ను ఆస్ట్రేలియా గెలుచుకున్న తర్వాత వార్నర్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ ఏడాది (2024) ప్రారంభంలో పాకిస్థాన్‌తో తన చివరి టెస్టు ఆడి టెస్టులకు గుడ్ బై చెప్పాడు. ఈ సమయంలో టీ20 వరల్డ్ కప్ 2024 తర్వాత క్రికెట్ కు వీడ్కోలు పలుకుతానని చెప్పిన ఈ ఆసీస్ ఓపెనర్.. అనుకున్నట్టుగానే అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్థాన్ వేదికగా ఫిబ్రవరిలో జరగనుంది. అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని సెలక్టర్లు వార్నర్ ను కరుణిస్తారో లేదో చూడాలి. 

ALSO READ | Virat Kohli: నా కల సాకారమైంది.. అలీబాగ్‌లో డ్రీమ్ హోమ్‌పై కోహ్లీ

2011లో ఆస్ట్రేలియా తరుపున టెస్ట్ అరంగ్రేటం చేసిన వార్నర్‌.. తన కెరీర్ మొత్తంలో 112 టెస్టులు ఆడారు. 205 ఇన్నింగ్స్‌లో 8786 పరుగులు చేశారు. ఇందులో 3 డబుల్ సెంచరీలు, 26 సెంచరీలు, 36 అర్థ సెంచరీలు ఉన్నాయి. హైయెస్ట్ స్కోర్.. 335 కాగా, సగటు 44.60. 161 వన్డేల్లో 6932 పరుగులు చేశాడు. వీటిలో 22 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 110 టీ20ల్లో 3277 పరుగులు చేశాడు. వీటిలో ఒక సెంచరీ.. 28 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.