సిడ్నీ: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ తన హోమ్‌గ్రౌండ్‌లో ఆఖరి టెస్టుకు రెడీ అయ్యాడు. మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఆసీస్, పాకిస్తాన్ మధ్య సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో బుధవారం మొదలయ్యే చివరి మ్యాచ్‌తో రెడ్ బాల్ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పనున్నాడు. పెర్త్, మెల్బోర్న్లో తొలి రెండు టెస్టుల్లో గెలిచిన ఆసీస్ ఇప్పటికే సిరీస్ సొంతం చేసుకుంది.
అదే జోరుతో 3–0తో పాక్‌ను వైట్‌వాష్ చేయడంతో పాటు వార్నర్‌కు విక్టరీతో ఘన వీడ్కోలు పలకాలని కంగారూ టీమ్ ఆశిస్తోంది. మరోవైపు ఆసీస్ గడ్డపై చివరగా 1985లో ఇదే ఎస్సీజీ గ్రౌండ్లో కంగారూలను ఓడించిన పాక్ ఈ మ్యాచ్‌లో నెగ్గి పరువు దక్కించుకోవాలని చూస్తోంది. వన్డేలకు కూడా గుడ్‌బై చెప్పిన వార్నర్ ఇకపై టీ20 ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతానని ప్రకటించాడు.