ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన 'పుష్ప' మూవీ క్లీన్ స్వీప్ చేయడంపై ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ అభినందనలు తెలిపాడు. 'ఫిల్మ్ ఫేర్ అవార్డులకు అల్లు అర్జున్ పుష్ప ఎంపికవ్వడం సంతోషం. ఈ సినిమా అంటే మాకు చాలా ఇష్టం. ఈ చిత్రంలో భాగమైన అందరికీ అభినందనలు' అంటూ పుష్ప గెటప్ లో ఉన్న తన ఫొటోను వార్నర్ షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన పుష్ప చిత్రానికి మొత్తం ఏడు విభాగాల్లో ఫిలింఫేర్ ఆవార్డులు లభించాయి. ఉత్తమ డైరెక్టర్, ఉత్తమ నటుడు, ఉత్తమ చిత్రం, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ నిర్మాత, ఉత్తమ మేల్ సింగర్, ఉత్తమ ఫిమేల్ సింగర్, ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్ విభాగాల్లో పుష్ప చిత్రానికి అవార్డుల పంట పండింది. గతేడాది డిసెంబర్ లో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 షూటింగ్ దశలో ఉంది.