BBL 2024-2025: తలకు తగిలిన బ్యాట్.. వార్నర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం

బిగ్ బాష్ లీగ్ లో ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ కు పెను ప్రమాదం నుంచి బయటపడ్డాడు. సిడ్నీ థండర్ తరపున ఆడుతున్న వార్నర్..  హోబర్ట్ హరికేన్స్ తో శుక్రవారం (జనవరి 10) జరిగిన మ్యాచ్ లో ఈ సంఘటన  జరిగింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్ లో లే మెరెడిత్‌ వేసిన బంతిని వార్నర్ మిడాఫ్ దిశగా ఆడాడు. ఈ దశలో బ్యాట్ విరిగి వార్నర్ తల వెనుక భాగంలో తగిలింది. అదృష్టవశాత్తు వార్నర్ తలకు ఎలాంటి గాయం కాలేదు. ఈ సంఘటనను బిగ్ బాష్ లీగ్ తమ అధికారిక ఎక్స్ లో వీడియో షేర్ చేశారు.

అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన వార్నర్ బిగ్ బాష్ లీగ్ లో అదరగొడుతున్నాడు. ఈ లీగ్ లో వరుసగా రెండో హాఫ్ సెంచరీతో చెలరేగుతున్నాడు. హోబర్ట్ హరికేన్స్ పై నేడు 66 బంతుల్లో 7 ఫోర్లతో 88 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. జట్టు చేసిన 164 పరుగుల్లో వార్నర్ ఒక్కడే సగానికి పైగా పరుగులు చేయడం విశేషం. ఈ మ్యాచ్ లో వార్నర్ రాణించినా హోబర్ట్ హరికేన్స్ పై సిడ్నీ థండర్ ఓడిపోయింది. 

Also Read :- డిఫెన్స్ ఆడగలిగితే అతను ప్రతి మ్యాచ్‌లో సెంచరీ కొట్టగలడు

మొదట బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్ వార్నర్ (88) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో హోబర్ట్ హరికేన్స్ మరో 19 బంతులు మిగిలి ఉండగానే ఛేజ్ చేసింది. టిమ్ డేవిడ్ 38 బంతుల్లో 66 పరుగులు చేసి జట్టుకు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. అతని ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 6 సిక్సర్లు ఉన్నాయి.