ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఇండియాకు ఎంత సుపరిచుతుడనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆస్ట్రేలియా తర్వాత భారత్ తన సొంతగడ్డగా భావించే వార్నర్.. ఇక్కడ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. వార్నర్ అద్భుతమైన ఆటగాడే కాదు చాలా మంచి మనిషి కూడా. ఆటతో పాటు సరదాగా కామెడీ చేసే వార్నర్.. తాజాగా తనలోని మానవత్వాన్ని చాటుకున్నాడు.
వరల్డ్ కప్ లో భాగంగా ఆసీస్ నవంబర్ 4 న ఇంగ్లాండ్ తో మ్యాచ్ ఆడాల్సి ఉంది. గుజరాత్ లోని అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్ కోసం ఇప్పటికే ఇరు జట్లు ఇక్కడకు చేరుకొని ప్రాక్టీస్ ప్రారంభించేసాయి. ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఉంటున్న ఈ హోటల్ సమీపంలో వార్నర్ వీధి కుక్కలకు నీళ్లు తాపిస్తూ కనిపించాడు. దాహంగా ఉన్న ఈ కుక్కలకు వార్నర్ నీళ్లు తప్పుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్స్ వార్నర్ ను ప్రశంసిస్తూ కామెంట్స్ పెడుతున్నారు.
Also Read :- కోహ్లీ 49వ సెంచరీపై రిజ్వాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
ఇక ఈ వరల్డ్ కప్ లో వార్నర్ వరుసగా రెండు సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ చేసి టాప్ ఫామ్ లో ఉన్నాడు. ఆడిన 6 మ్యాచ్ ల్లో 413 పరుగులు చేసి ఈ వరల్డ్ కప్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల లిస్టు లో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. వార్నర్ ఫామ్ తో ఆస్ట్రేలియా వరుస విజయాలను సాధిస్తుంది. తొలి రెండు మ్యాచ్ లు ఓడినా.. ఆ తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్ ల్లో గెలిచి సెమీస్ అసలు సజీవంగా ఉంచుకుంది.