ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తొలిసారి పాకిస్థాన్ సూపర్ లీగ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఈ ఆసీస్ ఓపెనర్ 2025 పాకిస్థాన్ సూపర్ లీగ్ లో కరాచీ కింగ్స్ తరపున ఆడనున్నాడు. 2025 పాకిస్థాన్ సూపర్ లీగ్ లో ప్లాటినం డ్రాఫ్ట్‌లో 44 మంది ఆటగాళ్లలో వార్నర్ కూడా ఉన్నాడు. రిటైర్మెంట్ తర్వాత బిగ్ బాష్ లీగ్ ఆడుతూ బిజీగా ఉన్న వార్నర్ త్వరలో జరగబోయే పాక్ లీగ్ లో సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాడు.
The IPL legend has a new home in the PSL 🇵🇰
— Sport360° (@Sport360) January 13, 2025
David Warner 🤝 Karachi Kings#HBLPSLDraft pic.twitter.com/B7opvu6dgM
ప్రస్తుతం జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ లో వార్నర్ అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఎనిమిది ఇన్నింగ్స్‌లలో 54 సగటుతో 324 పరుగులు చేశాడు. సిడ్నీ థండర్ తరపున ఆడుతున్న వార్నర్.. మూడు అర్ధ సెంచరీలు చేశాడు. ఐపీఎల్ లో అమ్ముడుపోని వార్నర్.. పాకిస్థాన్ సూపర్ లీగ్ లో భారీ ధరకు కొనుగోలు చేయడం విశేషం. ఇదిలా ఉంటే న్యూజిలాండ్ వెటరన్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ ప్లాటినం రౌండ్‌లో అమ్ముడుపోలేదు. అయితే అతన్ని డైమండ్ రౌండ్‌లో కరాచీ కింగ్స్ దక్కించుకుంది.
ALSO READ | BCCI Secretary: సెక్రటరీగా దేవజిత్ సైకియా.. బీసీసీఐ అఫీషియల్స్ వీరే
ప్రస్తుతం విలియంసన్ సౌతాఫ్రికా టీ20 లీగ్ లో డర్బన్ సూపర్ జెయింట్స్ తరపున ఆడుతున్నాడు. డర్బన్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన తన మొదటి మ్యాచ్‌లో 40 బంతుల్లో 60 పరుగులు చేసి రాణించాడు. ఐపీఎల్ లో విలియంసన్ ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయకపోగా.. పాకిస్థాన్ సూపర్ లీగ్ లో అతనికి ఊరట దక్కింది. ఇతర కివీస్ క్రికెటర్లు ఆడమ్ మిల్నే కరాచీ కింగ్స్‌కు.. మార్క్ చాప్‌మన్ క్వెట్టా గ్లాడియేటర్స్ తరపున ఆడనున్నాడు. డారిల్ మిచెల్‌తో లాహోర్ క్వాలండర్స్ జట్టుతో చేరాడు.
ప్లాటినం డ్రాఫ్ట్‌లో ఎంపికైన ఆటగాళ్ల జాబితా:
మైఖేల్ బ్రేస్‌వెల్: ముల్తాన్ సుల్తాన్స్
డేవిడ్ వార్నర్, ఆడమ్ మిల్నే, అబ్బాస్ అఫ్రిది: కరాచీ కింగ్స్
డారిల్ మిచెల్: లాహోర్ క్వాలండర్స్
మాథ్యూ షార్ట్: ఇస్లామాబాద్ యునైటెడ్
మార్క్ చాప్‌మన్, ఫహీమ్ అష్రఫ్ , ఫిన్ అలెన్: క్వెట్టా గ్లాడియేటర్స్
టామ్-కోహ్లర్ కాడ్మోర్: పెషావర్ జల్మీ
Kane Williamson will feature in PSL 2025, joining David Warner at Karachi Kings!#PSLDraft pic.twitter.com/nXGsJaZkJ8
— ESPNcricinfo (@ESPNcricinfo) January 13, 2025