బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ లో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ నటించాడా..? ఈ ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందుకు కారణం షారుఖ్ ఫేస్ ప్లేస్ లో డేవిడ్ వార్నర్ ఫేస్ ఉండడమే. తరచూ తన ఫన్నీ వీడియోలతో సోషల్ మీడియాలో హంగామా చేసే డేవిడ్ ఈ సారి పఠాన్ తో ముందుకొచ్చాడు. ఈ మధ్యే రిలీజై కోట్లలో కలెక్షన్లు వసూలు చేస్తున్న పఠాన్ లోని ఓ పాటకు షారూక్ ముఖానికి తన ముఖం మార్పింగ్ చేసి డేవిడ్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. దాంతో పాటు "వావ్ వాట్ ఏ ఫిల్మ్.. మీరు దీనికి పేరు పెట్టగలరా.. ?" అనే క్యాప్షన్ ను జోడిస్తూ.. లెజెండ్, ఐకాన్ అనే హ్యాష్ ట్యాగ్ లను జత చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఇప్పుడు డేవిడ్.. పఠాన్ అవతారమెత్తాడని ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. డేవిడ్ ఇలా చేయడం ఇదేం మొదటిసారి కాదు. ఇంతకుముందు కూడా ఫేస్ మాస్క్ యాప్ ద్వారా హీరోల ముఖాలను రిప్లేసి తన ముఖం కనిపించేలా చేసి వైరల్ గా మారాడు.