అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ బిగ్ బాష్ లీగ్ లో బిజీగా మారాడు. ఓ వైపు ఆటగాడిగా మరోవైపు కామెంట్రీ చేస్తూ ఫ్యాన్స్ కు డబుల్ కిక్ ఇస్తున్నాడు. శుక్రవారం (జనవరి 10) సిడ్నీ థండర్స్ తరపున ఆడుతున్న వార్నర్ శుక్రవారం (జనవరి 10) హాఫ్ సెంచరీతో సత్తా చాటిన వార్నర్ శనివారం (జనవరి 11) కామెంట్రీ బాట పట్టాడు. సిడ్నీ సిక్సర్స్, పెర్త్ స్కార్చర్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో కామెంట్రీ చేస్తూ సర్ ప్రైజ్ ఇచ్చాడు.
అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన వార్నర్ బిగ్ బాష్ లీగ్ లో అదరగొడుతున్నాడు. ఈ లీగ్ లో వరుసగా రెండో హాఫ్ సెంచరీతో చెలరేగుతున్నాడు. హోబర్ట్ హరికేన్స్ పై నిన్న (జనవరి 10) 66 బంతుల్లో 7 ఫోర్లతో 88 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. జట్టు చేసిన 164 పరుగుల్లో వార్నర్ ఒక్కడే సగానికి పైగా పరుగులు చేయడం విశేషం. ఈ మ్యాచ్ లో వార్నర్ రాణించినా హోబర్ట్ హరికేన్స్ పై సిడ్నీ థండర్ ఓడిపోయింది.
Also Read :- ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పాకిస్థాన్ టెస్ట్ స్క్వాడ్ ప్రకటన
2011లో ఆస్ట్రేలియా తరుపున టెస్ట్ అరంగ్రేటం చేసిన వార్నర్.. తన కెరీర్ మొత్తంలో 112 టెస్టులు ఆడారు. 205 ఇన్నింగ్స్‌లో 8786 పరుగులు చేశారు. ఇందులో 3 డబుల్ సెంచరీలు, 26 సెంచరీలు, 36 అర్థ సెంచరీలు ఉన్నాయి. హైయెస్ట్ స్కోర్.. 335 కాగా, సగటు 44.60. 161 వన్డేల్లో 6932 పరుగులు చేశాడు. వీటిలో 22 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నప్పటికీ వార్నర్.. మున్ముందు ఫ్రాంచైజీ క్రికెట్ లో ఎక్కువగా కనిపించనున్నాడు. 110 టీ20ల్లో ఓ సెంచరీతో 3277 పరుగులు చేశాడు.
No rest for David Warner! 😅 pic.twitter.com/SzLdBBhcDB
— CricketGully (@thecricketgully) January 11, 2025