ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా భారత్ తో ఆసీస్ మ్యాచ్ ఓడిపోవడంతో వార్నర్ అంతర్జాతీయ కెరీర్ ముగిసింది. టీ20 ప్రపంచకప్ 2024 తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తానని ఈ లెఫ్ట్ హ్యాండర్ ఈ ఏడాది ప్రారంభంలో చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో వార్నర్ అంతర్జాతీయ కెరీర్ ముగిసింది. ఇప్పటికే టెస్ట్, వన్డేలకు ఈ ఆసీస్ ఓపెనర్ గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.
వరల్డ్ కప్ లో భాగంగా ఆస్ట్రేలియా సోమవారం (జూన్ 24) టీమిండియాతో మ్యాచ్ ఓడిపోయింది. దీంతో సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. మంగళవారం (జూన్ 25) బంగ్లాదేశ్ పై ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించడంతో ఆసీస్ సూపర్ 8-లోనే ఇంటిదారి పట్టింది. దీంతో ఆసీస్ ఈ టోర్నీలో ఆడే అవకాశం లేకుండా పోయింది. తన చివరి మ్యాచ్ లో వార్నర్ 6 పరుగులే చేసి అర్షదీప్ సింగ్ బౌలింగ్ లో ఔటయ్యాడు. వరల్డ్ కప్ టైటిల్ తో ఆస్ట్రేలియాకు వీడ్కోలు చెబుదామనుకున్న వార్నర్ కు నిరాశ తప్పలేదు. మ్యాచ్ తర్వాత ఈ ఆసీస్ ఓపెనర్ కు ష్టాండింగ్ ఒవేషన్ కూడా లేదు. బాధతోనే తన అంతర్జాతీయ క్రికెట్ ను ముగించాల్సి వచ్చింది.
జనవరి 6, 2024 న టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన వార్నర్.. వన్డేలకు గుడ్ బై చెప్పారు. కాకపోతే తన సేవలు క్రికెట్ ఆస్ట్రేలియా కావాలనుకుంటే వచ్చే ఏడాది పాక్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో అడతానని అతను చెప్పినప్పటికీ అది జరుగుతుందని ఆశించలేం. వీడ్కోలు పలికిన ఆటగాడికి క్రికెట్ ఆస్ట్రేలియా మరో అవకాశమిచ్చే మంచి మనసు లేదు. దీంతో అతను మున్ముందు వన్డేల్లోనూ కనిపించేది అసంభవమే.
2011లో ఆస్ట్రేలియా తరుపున టెస్ట్ అరంగ్రేటం చేసిన వార్నర్.. తన కెరీర్ మొత్తంలో 112 టెస్టులు ఆడారు. 205 ఇన్నింగ్స్‌లో 8786 పరుగులు చేశారు. ఇందులో 3 డబుల్ సెంచరీలు, 26 సెంచరీలు, 36 అర్థ సెంచరీలు ఉన్నాయి. హైయెస్ట్ స్కోర్.. 335 కాగా, సగటు 44.60. 161 వన్డేల్లో 6932 పరుగులు చేశాడు. వీటిలో 22 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నప్పటికీ వార్నర్.. మున్ముందు ఫ్రాంచైజీ క్రికెట్ లో ఎక్కువగా కనిపించనున్నాడు. 110 టీ20ల్లో ఓ సెంచరీతో 3277 పరుగులు చేశాడు.
🚨 BREAKING 🚨
— Sportskeeda (@Sportskeeda) June 25, 2024
David Warner has retired from international cricket following Australia’s exit from the T20 World Cup 2024 🏏🇦🇺
The Australian opener, who has 49 international centuries to his name, retired from ODI and Test cricket earlier this year. However, he did keep the… pic.twitter.com/uvx2MwORcE