వెటరన్ ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ గజ్జల్లో నొప్పి కారణంగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండో టీ20కి దూరమయ్యాడు. ఈ స్టార్ ఓపెనర్ లేకవడంతో హెడ్ తో కలిసి స్మిత్ ఇన్నింగ్స్ ను ఓపెన్ చేశాడు. వార్నర్ న్యూజిలాండ్ నుండి స్వదేశానికి తిరిగి వస్తాడని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. ఈ సిరీస్ లో తొలి మ్యాచ్ లో వార్నర్ 20 బంతుల్లోనే 32 పరుగులు చేశాడు.
మర్చి 22 నుంచి ఐపీఎల్ 17వ సీజన్ మొదలు కానుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్న వార్నర్ ఆడకపోతే ఆ జట్టుకు పెద్ద ఎదరు దెబ్బ తెగిలినట్టే. నివేదికల ప్రకారం వార్నర్ గాయం పెద్దది కాకపోవడంతో ఐపీఎల్ సమయానికి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. సన్ రైజర్స్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ కు వచ్చిన వార్నర్.. 500కు పైగా పరుగులు చేసి సత్తా చాటాడు. కెప్టెన్ గా విఫలమైనా.. బ్యాటింగ్ లో అదరగొట్టాడు.
ఇటీవలే వార్నర్ తన టెస్ట్, వన్డే కెరీర్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టీ20ల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. టీ20 వరల్డ్ కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడని ఇప్పటికే తెలియజేశాడు. అయితే అంతర్జాతీయ లీగ్ ల్లో మాత్రం కొనసాగుతానని స్పష్టం చేశాడు. పంత్ తిరిగి రానుండటంతో వార్నర్ తన కెప్టెన్సీ పగ్గాలను కోల్పోయే అవకాశం ఉంది.
David Warner will miss the final T20I against New Zealand in Auckland due to groin soreness but is anticipated to recover in time for the beginning of the IPL next month.#DavidWarner pic.twitter.com/Ef0p9ks2gW
— IANS (@ians_india) February 24, 2024