David Warner: డాన్ అవతారంలో అదరహో.. సినిమా షూటింగ్ స్పాట్‌లో వార్నర్

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్ సినిమా షూటింగ్ లో కనిపించి సందడి చేశాడు. మెల్‌బోర్న్‌లో జరిగిన ఈ సినిమా ఏంటో తెలియాల్సి ఉంది. రిలీజ్ చేసిన చిత్రాల్లో వార్నర్ స్టయిలిష్ లుక్ లో అదరగొట్టేశాడు. 37 ఏళ్ల ఈ ఆసీస్ మాజీ ఓపెనర్ తెల్లటి చొక్కాతో షూటింగ్ స్పాట్ లో ఎరుపు హెలికాప్టర్ నుండి దిగి వస్తూ హల్ చల్ చేస్తున్నాడు. పెద్ద లాలిపాప్‌ను పీలుస్తూ సన్ గ్లాస్ పెట్టుకొని అభిమానులను సర్ ప్రైజ్ చేశాడు. గోల్డెన్ తుపాకీతో వార్నర్ జేమ్స్ బాండ్ సినిమా తరహాలో కొందరిని కాలుస్తున్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. 

వార్నర్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన అభిమానులు థ్రిల్ కు గురవుతున్నారు.   సినిమాలపై ఇప్పటికే తన ఆసక్తిని ప్రకటించిన వార్నర్ బాలీవుడ్ సినిమాల్లో అవకాశం వస్తే నటిస్తానని చెప్పకొచ్చాడు. పుష్ప సినిమా డైలాగ్స్ చెబుతూ గ్రౌండ్ లో సందడి చేస్తూ కనిపించాడు. ఇంస్టాగ్రామ్ లో తెలుగు సినిమా రీల్స్ చేస్తూ ఇక్కడ అందరికీ బాగా దగ్గరయ్యాడు. సెకండ్ ఇన్నింగ్స్ లో వార్నర్ సినిమాల్లో బిజీగా మారిన పెద్దగా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. 

Also Read :- సగం జట్టు పెవిలియన్‌కు.. రెచ్చిపోతున్న భారత పేసర్లు

వార్నర్ ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా భారత్ తో ఆసీస్ మ్యాచ్ ఓడిపోవడంతో వార్నర్ అంతర్జాతీయ కెరీర్ ముగిసింది. టీ20 ప్రపంచకప్ 2024 తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తానని ఈ లెఫ్ట్ హ్యాండర్ ఈ ఏడాది ప్రారంభంలో చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో వార్నర్ అంతర్జాతీయ కెరీర్ ముగిసింది. ఇప్పటికే టెస్ట్, వన్డేలకు ఈ ఆసీస్ ఓపెనర్ గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.