టెస్టులకు రిటైర్మెంట్ పలికిన ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్.. మున్ముందు బిగ్‌బాష్ లీగ్‌లో అలరించనున్నాడు. సిడ్నీ థండర్స్ తరుపున బరిలోకి దిగనున్నాడు. శుక్రవారం (జనవరి 12) సిడ్నీ క్రికెట్ గ్రౌండ్(ఎస్‌సిజి) వేదికగా సిడ్నీ సిక్సర్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో డేవిడ్ భాయ్ ఆడనున్నాడు. అయితే, ఈ మ్యాచ్‌కు ముందు వార్నర్ హాలీవుడ్ హీరో రేంజ్‌లో హెలిక్యాప్టర్‌లో మైదానంలో అడుగుపెట్టనున్నాడు.
సిడ్నీ సిక్సర్స్- సిడ్నీ థండర్స్ మ్యాచ్ జరగాల్సిన జనవరి 12న ఉదయం హంటర్ హ్యలీ ప్రాంతంలో వార్నర్ సోదరుడి పెండ్లి జరగనుంది. ఈ ప్రాంతం మ్యాచ్ జరగాల్సిన సిడ్నీ గ్రౌండ్‌కు దాదాపు 250 కిలోమీటర్ల దూరం. దీంతో వివాహానికి హాజరైన అనంతరం వార్నర్ ప్రైవేట్ హెలిక్యాప్టర్‌లో సిడ్నీకి బయలుదేరనున్నాడు. ప్రేక్షకులు స్టేడియంలోకి అనుమతించడానికి ముందే అతడు ఎస్‌సిజి అవుట్‌ఫీల్డ్‌లోకి దిగుతాడని సీడ్నీ థండర్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
David Warner to land on helicopter at SCG to make it to Sydney derby in BBL 13.
— CricTracker (@Cricketracker) January 11, 2024
David Warner will exit early from his brother's wedding in Hunter Valley in the afternoon to make it to the Sydney Smash. pic.twitter.com/PcChSsDzPL
మూడు మ్యాచ్‌లు
లీగ్ దశలో సీడ్నీ థండర్స్ ఇంకా మూడు మ్యాచ్‌లు ఆడాల్సివుండగా.. ఈ మూడింటిలో వార్నర్ ఆడనున్నాడు. అనంతరం డేవిడ్ భాయ్ దుబాయ్ వేదికగా జరిగే ఇంటర్నేషనల్ టీ20 లీగ్ కోసం యూఏఈ వెళ్లనున్నాడు.