David Warner: నెల రోజుల్లో భారత్‌తో టెస్ట్ సిరీస్‌.. వార్నర్ సంచలన నిర్ణయం

David Warner: నెల రోజుల్లో భారత్‌తో టెస్ట్ సిరీస్‌.. వార్నర్ సంచలన నిర్ణయం

ప్రస్తుతం ఆస్ట్రేలియాకు టెస్టుల్లో ఓపెనింగ్ స్లాట్ ఖాళీగా ఉంది. వార్నర్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత స్మిత్ ఓపెనర్ అవతారమెత్తినా.. ఆ ప్రయోగం ఫలించలేదు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన వార్నర్.. మళ్ళీ అంతర్జాతీయ టెస్టులకు అందుబాటులో ఉంటానని చెప్పుకొచ్చాడు.భారత్ టెస్ట్ సిరీస్ కు ముందు తాను షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో  ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించాడు.

"ఆస్ట్రేలియా జట్టుకు అవసరమైతే నేను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను. సెలక్టర్లు నుంచి ఫోన్ వస్తే తీయడానికి సిద్ధంగా ఉన్నాను. ఆస్ట్రేలియా తమ చివరి టెస్ట్ మ్యాచ్ ఫిబ్రవరిలో ఆడింది. నేను జనవరిలో ఆడాను. నా కంటే ఆసీస్ జట్టు ఈ ఏడాది ఒక  షెఫీల్డ్ షీల్డ్ ఎక్కువ ఆడింది అంతే. కాబట్టి నా ఫామ్ పై ఎలాంటి ఆందోళన లేదు". అని వార్నర్ మళ్ళీ ఆసీస్ జట్టుకు ఆడాలనే తన కోరికను బయటపెట్టాడు. 

ALSO READ | Jemimah Rodrigues: తండ్రి మతపరమైన కార్యకలాపాలు.. భారత క్రికెటర్ సభ్యత్వం రద్దు

జనవరి 6, 2024 న టెస్ట్ ఫార్మాట్‌‌కు వీడ్కోలు పలికిన వార్నర్‌.. వన్డేలకు గుడ్ బై చెప్పారు. కాకపోతే తన సేవలు క్రికెట్ ఆస్ట్రేలియా కావాలనుకుంటే వచ్చే ఏడాది పాక్ వేదికగా జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీలో అడతానని అతను చెప్పినప్పటికీ అది జరగడం అసాధ్యమమని ఆస్ట్రేలియా కోచ్ వార్నర్ కు షాక్ ఇచ్చాడు. వీడ్కోలు పలికిన ఆటగాడికి క్రికెట్ ఆస్ట్రేలియా మరో అవకాశమిచ్చే మంచి మనసు లేదు. దీంతో అతను మున్ముందు వన్డేల్లోనూ  కనిపించేది అసంభవమే.   

2011లో ఆస్ట్రేలియా తరుపున టెస్ట్ అరంగ్రేటం చేసిన వార్నర్‌.. తన కెరీర్ మొత్తంలో 112 టెస్టులు ఆడారు. 205 ఇన్నింగ్స్‌లో 8786 పరుగులు చేశారు. ఇందులో 3 డబుల్ సెంచరీలు, 26 సెంచరీలు, 36 అర్థ సెంచరీలు ఉన్నాయి. హైయెస్ట్ స్కోర్.. 335 కాగా, సగటు 44.60. 161 వన్డేల్లో 6932 పరుగులు చేశాడు. వీటిలో 22 సెంచరీలు, 33 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నప్పటికీ వార్నర్‌.. మున్ముందు ఫ్రాంచైజీ క్రికెట్ లో ఎక్కువగా కనిపించనున్నాడు.