The Hundred: వీళ్ళు మళ్ళీ కలిశారు: హండ్రెడ్ లీగ్‌లో కూడా ఒకే గూటికి చేరిన దిగ్గజాలు

The Hundred: వీళ్ళు మళ్ళీ కలిశారు: హండ్రెడ్ లీగ్‌లో కూడా ఒకే గూటికి చేరిన దిగ్గజాలు

ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్, న్యూజిలాండ్  స్టార్ క్రికెటర్ కేన్ విలియమ్సన్ మధ్య విడదీయలేని బంధం ఉందేమో అనిపిస్తుంది. వీరిద్దరూ కలిసి ముచ్చటగా మూడోసారి ఆడనున్నారు. ఐపీఎల్, పాకిస్థాన్ సూపర్ లీగ్ తర్వాత ఇంగ్లాండ్ లో జరగబోయే ది హండ్రెడ్ లీగ్ కలిసి ఆడేందుకు సిద్ధమయ్యారు. బుధవారం (మార్చి 13) ది హండ్రెడ్ లీగ్ లో ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను లండన్ స్పిరిట్ తీసుకుంది. అంతకముందు లండన్ స్పిరిట్ విలియంసన్ తో ఒప్పందం కుదుర్చుకుంది. వీరిద్దరూ మరోసారి కలిసి ఆడడం విశేషం.      

ఇటీవలే 2025 పాకిస్థాన్ సూపర్ లీగ్ లో కరాచీ కింగ్స్ తరపున ఈ జోడీ సత్తా చాటేందుకు సిద్ధమయ్యారు. అంతకముందు ఐపీఎల్ లో సన్ రైజర్స్ తరపున వార్నర్, విలియంసన్ సేవలను మర్చిపోలేం. ఈ ద్వయం ఎన్నో సీజన్ లు హైదరాబాద్ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. కెప్టెన్ గా, బ్యాటర్ గా ఇద్దరిది అద్భుతమైన ప్రస్తానం. న్యూజిలాండ్ సెంట్రల్ కాంట్రాక్ట్ వదులుకున్న తర్వాత విలియంసన్ ప్రపంచ లీగ్ లు ఆడేందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. మరోవైపు వార్నర్ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఫ్రాంచైజీ క్రికెట్ ఆడతానని స్పష్టం చేశాడు. వీరిద్దరూ 2025 ఐపీఎల్ మెగా ఆక్షన్ లో అమ్ముడు పోకపోవడం విచారకరం.  

Also Read : 45 మందిలో ఒక్కరిని కూడా కొనలేదు

2025 పాకిస్థాన్ సూపర్ లీగ్ లో ప్లాటినం డ్రాఫ్ట్‌లో 44 మంది ఆటగాళ్లలో వార్నర్ కూడా ఉన్నాడు. రిటైర్మెంట్ తర్వాత బిగ్ బాష్ లీగ్ ఆడుతూ బిజీగా ఉన్న వార్నర్ త్వరలో జరగబోయే పాక్ లీగ్ లో తొలిసారి కనిపించబోతున్నాడు. న్యూజిలాండ్ వెటరన్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ ప్లాటినం రౌండ్‌లో అమ్ముడుపోలేదు. అయితే అతన్ని డైమండ్ రౌండ్‌లో కరాచీ కింగ్స్ దక్కించుకుంది.  

వార్నర్ బిగ్ బాష్ లీగ్ తో అద్భుతమైన ఫామ్ లో ఉన్నాడు. ఎనిమిది ఇన్నింగ్స్‌లలో 54 సగటుతో 324 పరుగులు చేశాడు. సిడ్నీ థండర్ తరపున ఆడుతున్న వార్నర్.. మూడు అర్ధ సెంచరీలు చేశాడు. ఐపీఎల్ లో అమ్ముడుపోని వార్నర్.. పాకిస్థాన్ సూపర్ లీగ్ లో భారీ ధరకు కొనుగోలు చేయడం విశేషం. మరోవైపు విలియంసన్ సౌతాఫ్రికా టీ20 లీగ్ లో డర్బన్ సూపర్ జెయింట్స్ తరపున ఆడాడు. డర్బన్‌లో ప్రిటోరియా క్యాపిటల్స్‌తో జరిగిన తన మొదటి మ్యాచ్‌లో 40 బంతుల్లో 60 పరుగులు చేసి రాణించాడు. ఐపీఎల్ లో విలియంసన్ ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయకపోగా.. పాకిస్థాన్ సూపర్ లీగ్ లో అతనికి ఊరట దక్కింది. 

లండన్ స్పిరిట్ మెన్

జేమీ స్మిత్, జేమీ ఓవర్టన్, లియామ్ డాసన్, డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా) , డేనియల్ వొరాల్, కేన్ విలియమ్సన్ (న్యూజిలాండ్), రిచర్డ్ గ్లీసన్, ల్యూక్ వుడ్, ఓల్లీ స్టోన్, ఆష్టన్ టర్నర్ (ఆస్ట్రేలియా), ఓల్లీ పోప్, జాఫర్ చోహన్, కీటన్ జెన్నింగ్స్, వేన్ మాడ్సెన్