భారత్‌తో టీ20 సిరీస్ నుండి తప్పుకున్న వార్నర్..ఆసీస్ కొత్త జట్టు ఇదే

భారత్‌తో టీ20 సిరీస్ నుండి తప్పుకున్న వార్నర్..ఆసీస్ కొత్త జట్టు ఇదే

భారత్ తో 5 టీ20ల సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తప్పుకున్నాడు. వరల్డ్ కప్ తర్వాత తనకు రెస్ట్ కావాలని కోరడంతో సెలక్టర్లు ఈ డాషింగ్ ఓపెనర్ మాటను గౌరవించారు. వార్నర్ స్థానంలో ఆల్ రౌండర్ ఆరోన్ హార్డీను సెలక్ట్ చేశారు. ఈ ఏడాది సెప్టెంబరులో దక్షిణాఫ్రికా పర్యటనలో హార్డి తన వన్డే, T20I అరంగేట్రం చేసాడు. మరో వైపు యువ పేసర్ స్పెన్సర్ జాన్సన్ గాయపడడంతో అతని స్థానంలో సీనియర్ పేసర్ కేన్ రిచర్డ్సన్ ను 15 మంది స్క్వాడ్ లోకి చేర్చారు.

వరల్డ్ కప్ కు ముందే జట్టును ప్రకటించినప్పటికీ రెండు మార్పులతో మరోసారి  15 మందితో కూడిన స్క్వాడ్ ను ప్రకటించారు. నవంబర్ 23 నుంచి ఆస్ట్రేలియాతో ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు  వికెట్ కీపర్-బ్యాటర్ మాథ్యూ వేడ్‌ను కెప్టెన్‌గా నియమించారు. రెగ్యులర్ కెప్టెన్, పాట్ కమిన్స్, తో పాటు ఫాస్ట్ బౌలర్లు మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్ కు ఈ సిరీస్  విశ్రాంతిని ఇచ్చారు. వచ్చే  ఏడాది జూన్ లో టీ 20 వరల్డ్ ఉండడంతో ఈ సిరీస్ ను  ఆస్ట్రేలియా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తుంది. 

మరోవైపు భారత జట్టు కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ జట్టును నడిపించనున్నాడు. యువ భారత జట్టులో యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చారు. స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా, శమీ, రాహుల్, గిల్, జడేజా, కుల్దీప్ యాదవ్ ఈ సిరీస్ కు అందుబాటులో ఉండడం లేదు. వరల్డ్ కప్ ముగిసిన నాలుగు రోజుల్లోనే భారత్ ఆసీస్ తో సిరీస్ ఆడుతుంది.  

ఆస్ట్రేలియా జట్టు:

మాథ్యూ వేడ్ (కెప్టెన్), ఆరోన్ హార్డీ, జాసన్ బెహ్రెన్‌డార్ఫ్, సీన్ అబాట్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్‌వెల్, తన్వీర్ సంఘా, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టోనిని, మార్కస్ స్మిత్ కేన్ రిచర్డ్సన్, ఆడమ్ జంపా