భారత్ వేదికగా జరగుతున్న వన్డే ప్రపంచ కప్‌లో ఇంగ్లాండ్ ప్రదర్శన ఆ జట్టు ఆటగాళ్ల కెరీర్‌కు ముగింపు పలుకుతోంది. ఓటములకు నైతిక బాధ్యత వహిస్తూ ఇంగ్లాండ్ వరల్డ్ కప్ జట్టు సభ్యుడు, ఆల్‌రౌండర్ డేవిడ్ విల్లీ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పారు. భారత్ గడ్డపై ఈ టోర్నీలో ఇంగ్లాండ్ జట్టు ఆడే చివరి మ్యాచే.. తన కెరీర్‌లో ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ అని విల్లీ ప్రకటన చేశారు.
డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఇంగ్లాండ్ అంచనాలను అందుకోకపోగా.. పసికూన ఆఫ్గనిస్తాన్ చేతిలో కూడా పరాజయం పాలైంది. ఇప్పటివరకూ ఆడిన ఆరింటిలో కేవలం ఒక్క దాంట్లో నెగ్గింది. మ్యాచ్ ఫలితాలు పక్కన పెడితే.. అసలు ఇంగ్లండ్ జట్టు ఆటతీరులోనే ఎన్నో లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఈ ఓటములు డేవిడ్ విల్లీని మానసికంగా కృంగదీశాయి. ఎన్నో కలలు కన్న తన జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదని విల్లీ భావోద్వేగ ప్రకటన చేశారు.
ALSO READ :- బీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా పోటీలో ఉంటా : కొనపురి కవిత
"చిన్ననాటి నుండి ఇంగ్లాండ్ జట్టుకు క్రికెట్ ఆడాలని ఎన్నో కలలు కన్నాను. ఆ కల నెరవేరింది. అవకాశం వచ్చిన ప్రతిసారి నా జట్టు కోసం నేను పోరాడాను. ఎంతో గర్వంతో నా ఒంటిపై జెర్సీ ధరించాను. నా ఈ ప్రయాణంలో ఎన్నో జ్ఞాపకాలను, గొప్ప గొప్ప స్నేహితులను సంపాదించుకున్నాను. నా భార్యా పిల్లలు, అమ్మ, నాన్నల త్యాగం.. వారి మద్దతు లేకుంటే నా కలలు సాకారమయ్యేవి కావు. ఎంతో ఆలోచించాక ఈ నిర్ణయం తీసుకుంటున్నా. ఈ ప్రపంచ కప్ అనంతరం అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నా.." అని విల్లీ తన సోషల్ మీడియా ఖాతాలో ప్రకటన చేశాడు.
David Willey delivered an emotional statement after announcing his retirement from international cricket. pic.twitter.com/DsQjWRVgDz
— CricTracker (@Cricketracker) November 1, 2023
33 ఏళ్ల విల్లీ 2015లో ఇంగ్లాండ్ జట్టు తరుపున వన్డేల్లో, టీ20ల్లో అరంగేట్రం చేసాడు.
Thank you, David Willey ❤️ pic.twitter.com/4wkeVGAYXq
— England Cricket (@englandcricket) November 1, 2023