IPL 2024: ఇంగ్లాండ్ ప్లేయర్లకు ఏమైంది.. ఐపీఎల్ నుంచి తప్పుకున్న మరో ఇంగ్లీష్ బౌలర్

IPL 2024: ఇంగ్లాండ్ ప్లేయర్లకు ఏమైంది.. ఐపీఎల్ నుంచి తప్పుకున్న మరో ఇంగ్లీష్ బౌలర్

ఇంగ్లాండ్ ఆటగాళ్లకు ఏమైందో తెలియదు గాని ఒకొక్కరు ఐపీఎల్ టోర్నీ నుంచి తప్పుకుంటున్నారు. గాయాల కారణంగా కాకుండా వ్యక్తిగత కారణాలతో తప్పుకోవడం అనేక అనుమానాలకు గురి చేస్తుంది. దాదాపు అరడజను మంది ప్లేయర్లు 2024 ఐపీఎల్ మెగా సీజన్ కు దూరంగా ఉంటున్నారు. తాజాగా ఈ లిస్టులోకి ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ డేవిడ్ విల్లీ చేరిపోయాడు. లక్నో సూపర్ జయింట్స్ తరపున ఆడుతున్న ఈ ఇంగ్లీష్ పేసర్ వ్యక్తిగత కారణాల వలన ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ లకు దూరంగా ఉంటున్నట్టు తన నిర్ణయాన్ని తెలియజేశాడు. 

విల్లీ ఇటీవలే పాకిస్థాన్ సూపర్ లీగ్ లో ముల్తాన్ సుల్తాన్ తరపున అంతకముందు ఇంటర్ నేషనల్ లీగ్ లో అబుదాబి జట్టుకు ఆడాడు. ఐపీఎల్ లో చివరి రెండు సీజన్ లు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడిన డేవిడ్ విల్లీ.. 2024 సీజన్ లో లక్నో సూపర్ జయింట్స్ జట్టులో చేరాడు. లక్నో సూపర్ జెయింట్స్ విల్లీను రూ. 2 కోట్లకు దక్కించుకుంది. పేస్ బౌలింగ్ తో పాటు బ్యాటింగ్ చేయగల ఈ ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ లేకపోవడంతో లక్నో జట్టుకు ఎదురు దెబ్బ తగలనుంది. ఇప్పుటికే ఇంగ్లాండ్ పేసర్ మార్క్ వుడ్ 2024 సీజన్ మొత్తానికి తప్పుకోగా.. అతని స్థానంలో విండీస్ పేసర్ షామార్ జోసెఫ్ ను తీసుకున్నారు. 

ఇంగ్లాండ్ ప్లేయర్లు రూట్, స్టోక్స్, రాయ్, మార్క్ వుడ్, హ్యారీ బ్రూక్ ఇప్పటికే ఈ మెగా టోర్నీ నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే.    లక్నో తమ తొలి మ్యాచ్ ను మార్చి 24న రాజస్థాన్ రాయల్స్ తో తలబడుతుంది. మార్చి 22న  ఐపీఎల్ ప్రారంభమవుతుంది. తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతుంది.