ఇండియా ఆరో‘సారీ’.. డేవిస్‌‌‌‌ కప్‌‌‌‌లో స్వీడన్‌‌‌‌ చేతిలో ఓటమి

ఇండియా ఆరో‘సారీ’.. డేవిస్‌‌‌‌ కప్‌‌‌‌లో స్వీడన్‌‌‌‌ చేతిలో ఓటమి

స్టాక్‌‌‌‌హోమ్‌‌‌‌: డేవిస్ కప్‌‌‌‌లో ఇండియా టెన్నిస్ టీమ్ వరుసగా ఆరోసారి స్వీడన్‌‌‌‌ చేతిలో చిత్తయింది.  సింగిల్స్‌‌‌‌లో ప్రభావం చూపలేపోయిన రామ్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ రామనాథన్‌‌‌‌, శ్రీరామ్ బాలాజీ డబుల్స్‌‌‌‌లోనూ ఫెయిలయ్యారు. దాంతో వరల్డ్‌‌‌‌ వరల్డ్ గ్రూప్‌‌‌‌–1లో భాగంగా జరిగిన మ్యాచ్‌‌‌‌లో ఇండియా 0–4తో స్వీడన్ చేతిలో ఓడింది. తొలి రోజు రెండు సింగిల్స్‌‌‌‌లో ఓడిన  నేపథ్యంలో  ఆదివారం కచ్చితంగా నెగ్గాల్సిన డబుల్స్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో రామ్‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌–శ్రీరామ్‌‌‌‌ 3–6, 4–6తో వరుస సెట్లలో ఆండ్రి గొరాన్సన్‌‌‌‌–ఫిలిప్ బెర్గెవి చేతిలో పరాజయం పాలయ్యారు.   రివర్స్ సింగిల్స్‌‌‌‌లో సిద్దార్థ్ 2–6, 2–6తో  వైమెర్‌‌‌‌‌‌‌‌ చేతిలో చిత్తయ్యాడు.