కివీస్ ఖతర్నాక్ బ్యాట్స్మన్ డేవాన్ కాన్వే సరికొత్త రికార్డును సృష్టించాడు. ఈ ఏడాది తొలి సెంచరీ చేసిన బ్యాట్స్మన్ గా నిలిచాడు. పాక్తో జరుగుతున్న రెండో టెస్టులో డేవాన్ కాన్వే 191 బంతుల్లో 16 ఫోర్లు, ఒక సిక్స్తో 122 పరుగులు సాధించాడు. కరాచీ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో 92 పరుగుల వద్ద ఔటై సెంచరీ చేజార్చుకున్న కాన్వే.. రెండో రెండో టెస్ట్‌లో సెంచరీ చేశాడు.
ఏడాది ప్రారంభంలోనే తొలి సెంచరీ చేయడం డేవాన్ కాన్వేకిది వరుసగా రెండో ఏడాది. 2022లోనూ తొలి సెంచరీ అందుకున్నది డేవాన్ కాన్వేనే కావడం విశేషం. 2022 జనవరిలో బంగ్లాదేశ్‌తో మౌంట్‌మాంగనీ వేదికగా జరిగిన టెస్ట్‌లో 227 బంతుల్లో కాన్వే 122 పరుగులు చేశాడు. దీంతో వరుసగా రెండేళ్లు ప్రారంభ సెంచరీలు సాధించిన తొలి ప్లేయర్‌గా డేవాన్ కాన్వే చరిత్ర సృష్టించాడు.