ఇండియా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్.. దావూద్ ఇబ్రహీం ఆస్పత్రి పాలయ్యాడు. భారత్ ఆర్థిక రాజధాని ముంబైలో బాంబులు పేల్చి.. వందలాది మందిని చంపి.. మన దేశం నుంచి పారిపోయి పాకిస్తాన్ లో తలదాచుకుంటున్నాడు దావూద్. 65 ఏళ్ల వయస్సులో.. కరాచీలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలోనే.. 2023, డిసెంబర్ 17వ తేదీన.. తీవ్ర అనారోగ్యంతో కరాచీలోని ఓ ఆస్పత్రిలో చేరినట్లు వార్తలు వస్తున్నాయి. దావూద్ పై విష ప్రయోగం జరిగిందని.. అందుకే అతని ఆరోగ్యం క్షీణించిందనే ప్రచారం జరుగుతుంది.
దావూద్ ఇబ్రహీం ఆస్పత్రిలో చేరిన విషయాన్ని అటు పాకిస్తాన్, ఇటు ఇండియా దేశాలు ధృవీకరించలేదు. ఎలాంటి సమాచారం లేదని భారత్ భద్రత వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పాకిస్తాన్ నుంచి అధికారిక సమాచారం కోసం ఎదురు చూస్తున్నట్లు స్పష్టం చేశాయి. కొన్ని దశాబ్దాలుగా దావూద్ అజ్ణాతంలోనే ఉన్నారు.. బయట ఎక్కడా కనిపించటం లేదు.. అండర్ వరల్డ్ డాన్ గా.. భారత్, పాకిస్తాన్, ఇతర కొన్ని దేశాల్లో ఆర్థిక నేరాలు, హత్యలు, డ్రగ్స్ రవాణా, ఉగ్రవాదం వంటి కార్యక్రమాలను.. తన గ్యాంగ్స్ ద్వారా చేయిస్తున్నాడు దావూద్ ఇబ్రహీం..
గతంలోనూ ఇలాంటి చాలా వార్తలు వచ్చాయి. దావూద్ ఆరోగ్యం క్షీణించిందని.. కాళ్లు తీసేశారనే ప్రచారం జరిగింది. దీనికి సంబంధించిన ఎలాంటి అధికారిక ప్రకటనలు లేవు.. ఇప్పుడు మరోసారి ఇలాంటి వార్తలు రావటం విశేషం.. విష ప్రయోగం వల్ల.. దావూద్ ఆరోగ్యం బాగా క్షీణించిందని.. కరాచీలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం.. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ విషయంపై భారత్ కూడా ఓ నిఘా ఉంచింది...