ఇండియా–న్యూజిలాండ్​ తొలి టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వాన అడ్డంకి

ఇండియా–న్యూజిలాండ్​ తొలి టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వాన అడ్డంకి

బెంగళూరు : ఇండియా, న్యూజిలాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తొలి టెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షం వల్ల బుధవారం జరగాల్సిన తొలి రోజు ఆట మొత్తం తుడిచి పెట్టుకుపోయింది. ఉదయం నుంచి వాన పడటంతో గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కవర్లతో కప్పి ఉంచారు. టాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేసే అవకాశం కూడా రాలేదు. మధ్యాహ్నం రెండు గంటలకు కాస్త తెరిపి ఇవ్వడంతో అంపైర్లు గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పరిశీలించారు. తొలి లేయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కవర్లను తీసి చూడగా ఔట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫీల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బురద గుంటలు ఏర్పడ్డాయి.

వీటిని తొలగించేందుకు గ్రౌండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిబ్బంది చాలా ప్రయత్నాలు చేశారు. కానీ పిచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఇరువైపుల చిత్తడి ప్రాంతం ఎక్కువగా ఉండటంతో తొలి రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు అంపైర్లు ప్రకటించారు. రెండో రోజు ఆటను 9.15 గంటలకే మొదలుపెట్టనున్నారు. 8.45కు టాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేయనున్నారు. అయితే గురువారం కూడా వర్షం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ నివేదిక.

ఇక వాతావరణం ప్రతికూలంగా ఉన్నప్పటికీ స్టేడియం వద్ద ఫ్యాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బారులు తీరారు. అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అభిషేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు ఇండోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లిన స్టార్ బ్యాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విరాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోహ్లీ, ఓపెనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ యశస్వి జైస్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను చూసి ఉత్సాహానికి లోనయ్యారు.