మమ్మల్ని ఎవరూ నమ్మడం లేదు: ట్విట్టర్ సీఈవో

మమ్మల్ని ఎవరూ నమ్మడం లేదు: ట్విట్టర్ సీఈవో

సోషల్ మీడియా సంస్థలను ఎవరూ నమ్మడం లేదని ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సే ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పారదర్శకతపై ఎవరికీ నమ్మకం లేకుడా పోయిందని, ఇది బాధాకరమని నిరాశను వ్యక్తం చేశారు. సోషల్ మీడియాతోపాటు ఓవర్ ది టాప్ (ఓటీటీ) ప్లాట్‌ఫామ్స్‌‌పై కేంద్ర ప్రభుత్వం కొత్త నియమాలు ప్రవేశపెట్టిన నేపథ్యంలో డోర్సే పైవ్యాఖ్యలు చేయడం గమనార్హం. ‘అవును, చాలా మందికి మాపై నమ్మకం లేదు. దీన్ని మేం ఒప్పుకుంటాం. గత కొన్నేళ్లలో ఇది మరీ ఎక్కువైంది. మా ఒక్కరి (ట్విట్టర్) మీదే కాదు.. చాలా కంపెనీలు పారదర్శకత, నమ్మకలేమి సమస్యను ఎదుర్కొంటున్నాయి’ అని డోర్సే స్పష్టం చేశారు. సోషల్ మీడియా, ఓటీటీకి సంబంధించి ఐటీ శాఖ కొత్త గైడ్‌‌లైన్స్‌‌ను తీసుకొచ్చింది. వీటి ప్రకారం సోషల్ మీడియా, ఓటీటీల నుంచి వచ్చే ఫిర్యాదులను గ్రీవియెన్స్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్తారు. సదరు ఆఫీసర్ 24 గంటల్లో కంప్లయింట్‌‌ను నమోదు చేస్తారు. అలాగే ఫిర్యాదులకు సంబంధించి నెలవారీ రిపోర్టులను తయారు చేస్తారు. యూజర్ల ఫిర్యాదులను 15 రోజుల్లోగా పరిష్కరించాలి.