మొతెరాలో డే అండ్ నైట్‌ టెస్ట్‌

ఇండియాలో ఇంగ్లండ్‌ టూర్‌ షెడ్యూల్‌ రిలీజ్‌

చెన్నైలో తొలి రెండు టెస్టులు

చివరి రెండు టెస్టులు, టీ20 సిరీస్‌ మొత్తం అహ్మదాబాద్‌లో

పుణెలో మూడు వన్డేలు

న్యూఢిల్లీ: ఇండియాలో ఇంగ్లండ్‌‌ క్రికెట్‌‌ టీమ్‌‌ టూర్‌‌ షెడ్యూల్‌‌ ఖరారైంది. 4 టెస్ట్‌‌లు, 5 టీ20లు, 3 వన్డేల కోసం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లిష్‌‌ టీమ్‌‌.. ఇక్కడ అడుగుపెట్టనుంది. దీంతో కొవిడ్‌‌ నేపథ్యంలో ఈ టూర్‌‌ను కూడా యూఏఈకి తరలిస్తారని వస్తున్న కథనాలకు బీసీసీఐ అడ్డుకట్ట వేసింది. ఈ టూర్‌‌ (2020–21)కు సంబంధించిన కంప్లీట్‌‌ షెడ్యూల్‌‌ను ఇండియన్‌‌ బోర్డు గురువారం రిలీజ్‌‌ చేసింది. శ్రీలంకలో టూర్‌‌ ముగించుకుని ఇంగ్లండ్‌‌ టీమ్‌‌ జనవరి 27న చెన్నైలో ల్యాండ్‌‌ అవుతుంది. నాలుగు టెస్ట్‌‌ల సిరీస్‌‌లో భాగంగా తొలి రెండు మ్యాచ్‌‌లు (ఫిబ్రవరి 5 నుంచి 9, 13 నుంచి 17) చెన్నైలో జరగనున్నాయి. బీసీసీఐ రొటేషన్‌‌ పాలసీలో భాగంగా ఈ రెండు టెస్ట్‌‌లను చెన్నైకి కేటాయించారు. మొదట మొహాలీని కూడా టెస్ట్‌‌ వెన్యూగా అనుకున్నప్పటికీ.. చివరకు చెన్నై వైపు మొగ్గారు. ఎందుకంటే కొలంబో నుంచి ఇంగ్లండ్​ టీమ్​ గంటలోపే చెన్నైకి చేరుకోవచ్చు. దీంతో పాటు చెపాక్‌‌ పిచ్‌‌.. ఇండియన్‌‌ బౌలింగ్‌‌ అటాక్‌‌కు బాగా సూటవుతుందని భావిస్తున్నారు. ఇక ప్రతి సిరీస్‌‌లో ఓ డే/ నైట్‌‌ టెస్ట్‌‌ ఉండేలా చూస్తామని చెప్పిన బీసీసీఐ ప్రెసిడెంట్‌‌ సౌరవ్‌‌ గంగూలీ తన మాట నిలుపుకున్నాడు. ఇంగ్లండ్‌‌తో పింక్‌‌ బాల్‌‌ టెస్ట్‌‌కు అహ్మదాబాద్‌‌లోని మొతెరా స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. సిరీస్‌‌లో మూడో టెస్ట్‌‌ అయిన ఈ మ్యాచ్‌‌ వచ్చే ఏడాది ఫిబ్రవరి 24 నుంచి 28 వరకు జరుగుతుంది. అహ్మదాబాద్‌‌లో ఇంటర్నేషనల్‌‌ మ్యాచ్‌‌ జరగక దాదాపు ఆరేళ్లు అవుతోంది. దీనికితోడు బీసీసీఐ సెక్రటరీ జై షా హోమ్‌‌ బేస్‌‌ కావడంతో ఈసారి రెండు టెస్ట్‌‌లను కేటాయించారు. స్వదేశంలో ఇది రెండో డే/నైట్‌‌ టెస్ట్‌‌ కావడం గమనార్హం. ఫస్ట్‌‌ మ్యాచ్‌‌ బంగ్లాదేశ్‌‌తో ఈడెన్‌‌ గార్డెన్స్‌‌లో జరిగింది. మార్చి 4 నుంచి 8 వరకు నాలుగో టెస్ట్‌‌ కూడా అహ్మదాబాద్​లో జరుగుతుంది. మొతెరాలో 11 పిచ్‌‌లు అందుబాటులో ఉండటంతో డొమెస్టిక్‌‌ ప్లేయర్ల మధ్య ఓ అనధికార మ్యాచ్‌‌ను కూడా నిర్వహించాలని గుజరాత్‌‌ క్రికెట్‌‌ అసోసియేషన్‌‌ భావిస్తోంది.

మొతెరాలోనే ధనాధన్‌‌..

రెండు టెస్ట్‌‌లతో పాటు ఐదు టీ20 మ్యాచ్‌‌లను కూడా బీసీసీఐ మొతెరాకే కేటాయించింది. వరల్డ్‌‌లోనే లార్జెస్ట్‌‌ క్రికెట్‌‌ స్టేడియం అయిన ఈ గ్రౌండ్‌‌ సీటింగ్‌‌ కెపాసిటీ లక్షా 10 వేలు. అయితే అప్పటివరకు ఫ్యాన్స్‌‌ను స్టేడియంలోకి అనుమతిస్తారా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. ఒకవేళ పర్మిషన్‌‌ ఇస్తే.. ఫుల్‌‌ క్రౌడ్‌‌తో మొతెరాలో మోత మోగుతుంది. సెంట్రల్‌‌ గవర్నమెంట్‌‌ డైరెక్షన్స్‌‌ ప్రకారమే దీనిపై నిర్ణయం ఉంటుందని బీసీసీఐ సెక్రటరీ జై షా పేర్కొన్నారు. మార్చి 12 నుంచి 20 వరకు ఐదు టీ20లు ఇక్కడే జరుగుతాయి. ఇక టూర్​లో చివరిదైన వన్డే సిరీస్‌‌ను పుణెకు కేటాయించారు. మూడు మ్యాచ్‌‌లను అక్కడే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 23 నుంచి 28 వరకు ఈ సిరీస్‌‌ జరుగుతుంది. దేశంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా… ఈసారి టూర్‌‌ మొత్తాన్ని మూడు వేదికలకే పరిమితం చేశారు. రెండు దేశాల బోర్డుల మధ్య అనేక చర్చల తర్వాతే టూర్‌‌ షెడ్యూల్‌‌ను ఫైనలైజ్‌‌ చేశామని జై షా వెల్లడించారు. ఈ టూర్‌‌ మొత్తం చాలా ఆసక్తికరంగా జరుగుతుందన్నారు. తాము కూడా ఈ సిరీస్‌‌ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నామని ఈసీబీ సీఈవో టామ్‌‌ హారిసన్‌‌ చెప్పారు.

ఐపీఎల్‌ కోసమేనా..
కరోనా కారణంగా ఈ ఏడాది మార్చిలో సౌతాఫ్రికా తమ లిమిటెడ్‌ ఓవర్స్‌ సిరీస్‌ ను రద్దు చేసుకుని వెళ్లిపోయిన తర్వాత మళ్లీ ఇండియాలో క్రికెట్‌ జరగలేదు. గవర్నమెంట్‌ పర్మిషన్‌ ఇవ్వకపోవడంతో ఐపీఎల్‌‌‌‌–13ను యూఏఈలో నిర్వహించారు. దీం తో ఇంగ్లం డ్‌ టూర్‌ ను పూర్తి స్థాయిలో సక్సెస్‌
చేస్తే.. ఆ వెంటనే జరిగే ఐపీఎల్‌‌‌‌–14కు లైన్‌ క్లియర్‌ అవుతుందని బీసీసీఐ భావిస్తోంది. అందుకే చాలా చర్చల తర్వాత అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని మూడు వేదికలను ఖరారు చేశారు. ఈ మూడింటిలో ఏర్పాటు చేసే బయో బబుల్‌‌‌‌ను అలాగే కొనసాగిస్తే ఐపీఎల్‌‌‌‌కు కూడా ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు. అందుకే బీసీసీఐ ఆపరేషన్స్‌ టీమ్‌ చాలా కసరత్తుల తర్వాత వీటి వైపు మొగ్గినట్లు సమాచారం. అత్యవసరమైతే ఈ మూడు వేదికల్లోనే ఐపీఎల్‌‌‌‌ను ముగించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని మరికొందరి విశ్లేషణ.

For More News..

వ్యాక్సిన్​ అందరికీ అందాలి

‘నీట్​2021’ను రద్దు చేయం

క్రికెట్‌‌కు గుడ్‌‌బై చెప్పిన పార్థివ్‌‌కు సూపర్ ఆఫర్