కంటెంట్ కాదు.. డైరెక్టర్ ఈజ్ కింగ్

కంటెంట్ కాదు..  డైరెక్టర్ ఈజ్ కింగ్

జేడీ చక్రవర్తి టైటిల్‌‌ రోల్‌‌లో పవన్ సాధినేని తెరకెక్కించిన వెబ్‌‌ సిరీస్ ‘దయా’. ఈషా రెబ్బా, రమ్య నంబీషన్,  కమల్ కామరాజ్ ఇతర పాత్రలు పోషించారు. ఈ నెల 4 నుంచి  డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌‌‌‌లో స్ట్రీమింగ్  కానుంది. ఈ సందర్భంగా జేడీ చక్రవర్తి మాట్లాడుతూ ‘అందరూ కంటెంట్ ఈజ్ కింగ్ అంటారు. కానీ నేను  కంటెంట్ ఈజ్ ది ప్రిన్స్, డైరెక్టర్ ఈజ్ కింగ్ అని నమ్మే నటుడిని. ఈ కథను పవన్ చెప్పిన విధానం ఆకట్టుకుంది. దీనికి పాత్రలే ప్రధాన బలం. ప్రతి క్యారెక్టర్ యూనిక్‌‌గా ఉంటుంది. ఇందులో  నేను చేపలను ఒక ఊరి నుంచి మరో ఊరికి తీసుకెళ్లే ఫ్రీజర్ వ్యాన్ డ్రైవర్‌‌‌‌ను. 

ఒకరోజు ఆ వెహికల్‌‌లో ఇద్దరమ్మాయిలు శవాలుగా కనిపిస్తారు.  సాదాసీదా జీవితం గడిపే ఆ డ్రైవర్ జీవితాన్ని ఈ ఘటన ఎలాంటి మలుపు తిప్పుతుందనేది కథ. కథను సినిమాలో కంటే విస్తృతంగా చెప్పేందుకు వెబ్ సిరీస్ బాగా ఉపయోగపడుతుంది. నా బలం తెలుగు చిత్ర పరిశ్రమే. బాలీవుడ్ నాకు పొరుగు ఇల్లు లాంటిది. అందుకే కొంతకాలం అటువైపు వెళ్లి వచ్చా. ప్రస్తుతం తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో వరుస ప్రాజెక్టులు చేస్తున్నా’ అని చెప్పారు.