మియాపూర్‌లో పగటి దొంగ అరెస్ట్​

 మియాపూర్‌లో పగటి దొంగ అరెస్ట్​

మియాపూర్, వెలుగు : పట్టపగలే  దొంగతనానికి పాల్పడుతున్న వ్యక్తిని మియాపూర్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. మియాపూర్ డీఐ రమేశ్​ నాయుడు  వివరాల ప్రకారం.. వరంగల్ కాశీబుగ్గ వివేకానంద కాలనీకి  చెందిన నాగేలి హేమంత్ సాయి (23) జల్సాలకు అలవాటు పడి  పగటిపూట దొంగతనాలు చేస్తున్నాడు. ఈ   క్రమంలో మియాపూర్ మాధవ నగర్ కాలనీ లో  ఉండే  ప్రైవేట్​ టీచర్​ ఇంట్లో  ఎవరూ లేని సమయంలో గత నెల 20న  దొంగతనం చేశాడు.  

ఇంటి తాళం పగలగొట్టి  ఉందని గమనించిన చుట్టుపక్కల వారు   నాన్సీకి  సమాచారం ఇచ్చారు.  అతను వచ్చి  చూడగా బీరువా తాళాలు పగల పగలగొట్టి ఉన్నాయి.  ఇంట్లో ఉన్న బంగారం ఆభరణాలు , నగదు ఎత్తుకెళ్లినట్లు గుర్తిచి,  మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.

దీంతో  సీసీఎస్ పోలీసుల సహకారంతో   హేమంత్ సాయిని పట్టుకొని, విచారించగా దొంగతనం  బయటపడింది. అతని నుంచి  57.5 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు.   హేమంత్ సాయిపై ఇప్పటికే   అల్వాల్, పెట్ బషీరాబాద్, చిలుకలగూడ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనం కేసులు ఉన్నాయని, గతంలో ఒకసారి జైలుకి కూడా వెళ్లి వచ్చాడని పోలీసులు తెలిపారు.