Layoffs: AIఎఫెక్ట్..డీబీఎస్‌‌‌‌‌‌‌‌లో 4 వేల మంది ఉద్యోగులు ఔట్

Layoffs: AIఎఫెక్ట్..డీబీఎస్‌‌‌‌‌‌‌‌లో 4 వేల మంది ఉద్యోగులు ఔట్

న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వాడకం పెరుగుతుండడంతో రానున్న మూడేళ్లలో  నాలుగు వేల మంది ఉద్యోగులను తగ్గించుకుంటామని  నాస్కామ్‌‌‌‌‌‌‌‌ ఈవెంట్‌‌‌‌‌‌‌‌లో డీబీఎస్‌‌‌‌‌‌‌‌ గ్రూప్ సీఈఓ పీయూష్‌‌‌‌‌‌‌‌ గుప్తా పేర్కొన్నారు. ‘ఈ ఏడాది నా అంచనా ఏంటంటే, రానున్న మూడేళ్లలో  మొత్తం వర్క్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌లో  10 శాతం మందిని తగ్గించుకుంటాం.  ఏఐ శక్తివంతమైంది. ఇది స్వతహాగా క్రియేట్ చేయగలదు. ఇతరులను అనుసరించగలదు’ అని గుప్తా పేర్కొన్నారు.  

 గత పదేళ్లలో డీబీఎస్‌‌‌‌‌‌‌‌ గ్రూప్‌‌‌‌‌‌‌‌లో  ఉద్యోగుల కోత జరగలేదని చెప్పారు. పైన పేర్కొన్న 4 వేల మంది ఉద్యోగుల్లో  కాంట్రాక్ట్‌‌‌‌‌‌‌‌, టెంపరరీ ఉద్యోగులు  ఎక్కువగా ఉంటారని నాస్కామ్ ఈవెంట్ తర్వాత డీబీఎస్ వివరణ ఇచ్చింది.