ఐపీఎల్ 17వ సీజన్లో మరో ఆసక్తికర పోరుకు సమయం ఆసన్నమైంది. విశాఖపట్టణం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ రెండు మార్పులతో బరిలోకి దిగుతోంది. తొలి రెండు మ్యాచ్‌లకు బెంచ్‌కు పరిమితమైన పృథ్వీ షా తుది జట్టులో చోటు దక్కించుకున్నాడు. కుల్దీప్ యాదవ్ స్థానంలో ఇషాంత్ శర్మను తీసుకున్నారు. మరోవైపు, చెన్నై ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది.
తుది జట్లు:
ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, డేవిడ్ మిల్లర్, మిచెల్ మార్ష్, రిషభ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, సుమిత్ కుమార్, అన్రిచ్ నోకియా, ముకేశ్ కుమార్, ఇషాంత్ శర్మ, ఖలీల్ అహ్మద్.
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్యా రహానే, డారిల్ మిచెల్, జడేజా, సమీర్ రిజ్వీ, ధోనీ(వికెట్ కీపర్), దీపక్ చాహర్, తుశార్ దేశ్‌పాండే, మతీష పథిరణ, ముస్తాఫిజుర్ రెహ్మాన్.