విశాఖపట్టణం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారథి, వికెట్ కీపర్ ఎంఎస్ ధోని ఒక అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ఈ మ్యాచ్ లో పృథ్వీ షాను అవుట్ (క్యాచ్) చేసిన ధోని, టీ20 క్రికెట్‌లో 300 అవుట్‌లు నమోదు చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఈ ఘనత సాధించిన ప్రపంచంలోనే మొదటి వికెట్ కీపర్ ధోనీనే.
ఈ సీజన్‌లో ధోని ఇప్పటికే మూడు ఇన్నింగ్స్‌ల్లో నాలుగు క్యాచ్‌లు అందుకున్నాడు. తద్వారా టీ20 క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన క్వింటన్ డి కాక్ ఆల్-టైమ్ రికార్డ్‌ను బద్దలు కొట్టాడు.
టీ20 క్రికెట్‌లో అత్యధిక అవుట్‌లు
- ఎంఎస్ ధోని - 300 అవుట్‌లు (212 క్యాచ్‌లు)
- దినేష్ కార్తీక్ - 276 అవుట్‌లు (207 క్యాచ్‌లు)
- కమ్రాన్ అక్మల్ - 274 అవుట్‌లు (172 క్యాచ్‌లు)
- క్వింటన్ డి కాక్ - 269 అవుట్‌లు (220 క్యాచ్‌లు)
- జోస్ బట్లర్ - 208 అవుట్‌లు (167 క్యాచ్‌లు)
MS Dhoni becomes the first wicket-keeper to have 300 dismissals in T20s 🐐 pic.twitter.com/tHgD5DdYgY
— ESPNcricinfo (@ESPNcricinfo) March 31, 2024