విశాఖ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ మోస్తరు లక్ష్యాన్ని నిర్ధేశించింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులు చేసింది. ఓపెనర్, మాజీ సారథి డేవిడ్ వార్నర్(52; 35 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్ లు), ప్రస్తుత కెప్టెన్ రిషబ్ పంత్(51; 32 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకాలు బాదారు.
ఉతికారేసిన వార్నర్
టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీకి మెరుపు ఆరంభం లభించింది. ఓపెనర్లు పృథ్వీ షా(43), డేవిడ్ వార్నర్(52) జోడి తొలి వికెట్‌కు 9.3 ఓవర్లలోనే 93 పరుగులు జోడించారు. వీరిద్దరూ కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు స్కోర్‌బోర్డును పరుగులు పెట్టించారు. కీలక సమయంలో వీరిద్దరూ వెనుదిరిగినా.. రిషభ్ పంత్(51) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టుకు మంచి స్కోర్ అందించాడు.
A STANDING OVATION FROM VIZAG CROWD FOR RISHABH PANT. 💥 pic.twitter.com/teF6Q5smCi
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 31, 2024
చెన్నై బౌలర్లలో మతీష పతిరాణా తన 4 ఓవర్లలో 31 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. విశాఖపట్టణం బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంది. పటిష్ట బ్యాటింగ్ లైనప్ ఉన్న చెన్నై ఏ మేరకు రాణిస్తుందో వేచిచూడాలి.
SWEET SLINGS! 💥#DCvCSK #WhistlePodu #Yellove🦁💛pic.twitter.com/VQ3igLqUvt
— Chennai Super Kings (@ChennaiIPL) March 31, 2024