DC vs LSG: టాస్ గెలిచిన లక్నో.. ఓడితే ఢిల్లీ ఇంటికే!

DC vs LSG: టాస్ గెలిచిన లక్నో.. ఓడితే ఢిల్లీ ఇంటికే!

ప్లే ఆఫ్స్ రేసు సమీకరణాలు మారుతున్న వేళ మ్యాచ్‌లు రసవత్తరంగా జరుగుతున్నాయి. విజయం నీదా.. నాదా అన్నట్లు తలపడుతున్నాయి లీగ్‌ దశ చివరికి చేరుకున్నా.. ఇప్పటికీ ఒక్కటంటే ఒకటే జట్టు(కోల్ కతా) అధికారికంగా ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అయింది. మిగిలిన మూడు స్థానాల కోసం 6 జట్లు పోటీలో ఉన్నాయి. ఇలాంటి కీలక సమయంలో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో ఉన్న లక్నో సూపర్‌ జెయింట్స్‌... ఆరో స్థానంలో ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌‌తో తలపడుతోంది. 

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన లక్నో సారథి కేఎల్ రాహుల్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. ప్లే ఆఫ్‌ రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో ఢిల్లీకి గెలుపు తప్పనిసరి. ఇందులో విజయం సాధిస్తే 7 విజయాలతో ఐదో స్థానానికి చేరుకోవచ్చు. అదే ఓడితే నేరుగా ఎలిమినేట్‌ అవుతుంది. మరోవైపు, లక్నో ఇంకా రెండు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. నేడు ఢిల్లీపై గెలిచి.. ఆ తర్వాత ముంబైపై విజయం సాధిస్తే 8 విజయాలతో టాప్‌ 4లోకి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. దీంతో హోరాహోరీ పోరు తప్పకపోవచ్చు.

తుది జట్లు

ఢిల్లీ: అభిషేక్ పోరెల్, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, షాయ్ హోప్, రిషబ్ పంత్(కెప్టెన్/ వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్, గుల్బాదిన్ నాయబ్, రసిఖ్ దార్ సలామ్, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, ఖలీల్ అహ్మద్.
 
లక్నో: కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డి కాక్, మార్కస్ స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పూరన్, కృనాల్ పాండ్యా, యుధ్వీర్ సింగ్ చరక్, అర్షద్ ఖాన్, రవి బిష్ణోయ్, నవీన్-ఉల్-హక్, మొహ్సిన్ ఖాన్.