Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.

ఈ మధ్య కాలంలో టెక్నాలజీని బాగా పెరిగింది. మెడిసిన్స్ కూడా ఇంటివద్దకు డెలివరీ చేస్తున్నారు. కొందరు ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా మందులకు తయారు చేస్తూ ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారు. దీంతో ప్రభుత్వ అధికారులు నకిలీ మందుల తయారీ సంస్థలపై చర్యలకి సిద్ధమవుతున్నారు.

ఈ క్రమంలో తెలంగాణలోని పెద్దపల్లికి చెందిన ఓ మెడికల్ షాపులో 'పత్రికేర్ సిరప్', 'ఆయుర్వేద మెడిసిన్ ని డీసీఏ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సిరప్ లేబుల్ మీద 'కిడ్నీ స్టోన్స్'కి చికిత్స ఉన్నట్లుగా గుర్తించారు. కానీ ఈ సిరప్ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తయారు చేశారని అలాగే సిరప్ ని ప్రమోట్ చేయడంలో కూడా తప్పుడు ప్రకటనలు ఇస్తోందని అధికారులు కనుగొన్నారు.

ఇక ఈ మెడిసిన్ గుజరాత్‌లోని కలోల్ గాంధీనగర్‌లోని భవానీ ఫార్మాస్యూటికల్స్‌చే తయారు చేయబడిందని 1954 మ్యాజిక్ రెమెడీ యాక్ట్ ని తప్పుదోవ పట్టినచినందుకుగానూ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు.

ALSO READ | ఈ ఐడియా ఏదో బాగుందే: సిగరెట్ మానేస్తే సెలవులిస్తున్న కంపెనీ..

అయితే ఈ మధ్య కొందరు డ్రగ్స్‌ అండ్‌ మ్యాజిక్‌ రెమెడీస్‌ 1954 యాక్ట్ లోని లూప్ హొల్స్ ని ఆసరాగా తీసుకుని ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా, అనుమతులు తీసుకోకుండా ఆయుర్వేద మెడిసిన్స్ తయారు చేసి అమ్ముతున్నారు. ముఖ్యంగా వనమూలికలతో తయారు చేసిన మెడిసిన్స్ 100% నేచురల్, నో కెమికల్స్ అంటూ ప్రమోట్ చేసుకుంటున్నారు.

కేవలం కిడ్నీ స్టోన్స్ అని మాత్రమేకాదు ఈ మధ్య క్యాన్సర్, డయాబెటీస్, థైరాయిడ్, అలాగే మరిన్ని ప్రాణాంతక జబ్బులకి కూడా మెడిసిన్స్ అంటూ కోట్ల రూపాయలు బిజినెస్ చేస్తున్నారు. సోషల్ మీడియా మాధ్యమాలని ఆసరాగా చేసుకుని అమ్ముతున్నారు. దీంతో కొందరు డాక్టర్ల ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇలాంటి మెడిసిన్స్ వాడుతూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు.